Movie News

ఈ కథను అడివి శేష్ చేసి ఉంటే..

కొన్ని కథలు సాధారణంగా అనిపించినా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి సినిమాను ఎంగేజింగ్‌గా మారుస్తుంటారు దర్శకులు. కొన్ని కథల్లో విషయం ఉన్నా.. సరైన స్క్రీన్ ప్లే లేక.. తెర మీద ఆ కథను ప్రెజెంట్ చేయడంలో తడబాటు వల్ల తేడా కొడుతుంటాయి. గురువారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పై’ సినిమా రెండో కోవకే చెందుతుంది.

ఈ చిత్ర ట్రైలర్ చూసిన వాళ్లు సినిమా గురించి చాలానే ఊహించుకున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా మారిన గ్యారీ బీహెచ్.. టీజర్, ట్రైలర్ కట్ చేయడంలో తన నైపుణ్యాన్ని బాగానే చూపించాడు. ఒక రేసీ థ్రిల్లర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి టీజర్, ట్రైలర్. సినిమాలోని బెస్ట్ షాట్స్ తీసుకుని ఒక టాప్ నాచ్ థ్రిల్లర్ సినిమా తరహాలో టీజర్, ట్రైలర్లు కట్ చేశాడు గ్యారీ. కానీ సినిమాలో ఆ వేగం.. ఆ మెరుపులు కనిపించలేదు.

ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ యాంగిల్ గురించి ప్రేక్షకులు ఏదో ఊహించుకున్నారు. కానీ ఆయన పాత్రను సరిగా వాడుకోలేదు. ఆ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్‌ చూస్తే.. ఇది విషయం ఉన్న కథే అనిపిస్తుంది. కథకుడు మంచి పాయింటే పట్టుకున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన మరణం, ఇతర విషయాలకు సంబంధించిన ఫైల్స్‌కు.. ఈ కథకు ముడిపెట్టి పకడ్బందీ కథనాన్ని అల్లడంలో.. తెరపై ఈ థ్రెడ్‌ను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు, అతడి టీం ఫెయిలైంది.

ఒక థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన ఇంటెన్సిటీ, ఉత్కంఠ ఇందులో మిస్సయ్యాయి. తెలుగులో థ్రిల్లర్ సినిమాలంటే అందరికీ అడివి శేషే గుర్తుకొస్తాడు. మంచి రైటర్ కూడా అయిన అతను.. ఏ దర్శకుడితో పని చేసినా.. స్క్రీన్ ప్లే విషయంలో మంచి కసరత్తు చేసి పకడ్బందీగా స్క్రిప్టు తీర్చిదిద్దుకుంటాడు. అందుకోసం చాలా టైం పెడతాడు. ఇక ఎగ్జిక్యూషన్ కూడా అదిరిపోతుంది. లూజ్ ఎండ్స్ లేకుండా.. లూప్ హోల్స్ లేకుండా రేసీగా స్క్రీన్ ప్లే రాయడం.. సినిమాను పరుగెత్తించడంలో శేష్ స్టైలే వేరు. ‘స్పై’ లాంటి పాయింట్‌ను శేష్‌కు అప్పగించి ఉంటే మాత్రం దీన్ని వేరే లెవెల్‌కు తీసుకెళ్లి ఉండేవాడు అనడంలో సందేహం లేదు.

This post was last modified on June 29, 2023 10:23 pm

Share
Show comments
Published by
Satya
Tags: Adivi sesh

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

7 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

8 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

9 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

11 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

12 hours ago