మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బ్రో’ టీజర్ రానే వచ్చింది. మాంచి ఎంటర్టైనర్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చింది టీజర్. పవన్ కళ్యాణ్ దేవుడి పాత్ర అంటే ఏదో ఊహించుకున్నారు కానీ.. అసలు ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఈ పాత్రను ప్రెజెంట్ చేసింది టీమ్.
ఈ సినిమా తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ చూసిన వాళ్లకు ఈ రోజు టీజర్ చూసి దిమ్మదిరిగే ఉంటుంది. మాతృకకు దీనికి అసలు పోలికే లేదు. రీమేక్ సినిమాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మలచడంలో మన దర్శకుల స్టైలే వేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీమేక్‌లన్నీ కూడా తెలుగులోకి వచ్చేసరికి కొత్తరూపు సంతరించుకుంటూ ఉంటాయి. గబ్బర్ సింగ్, పింక్, భీమ్లా నాయక్ అందుకు ఉదాహరణ. ‘బ్రో’ కూడా ఈ వరుసలోనే ఒరిజినల్‌తో పోలిస్తే కొత్త కలర్ తెచ్చుకుంది.
కాకపోతే ఈసారి విశేషం ఏంటంటే.. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే రీమేక్ కూడా డీల్ చేశాడు. కానీ ఔట్ పుట్ చూస్తే ఆ సినిమా ఈ సినిమా తనే తీశానా అని సముద్రఖనినే ఆశ్చర్యపోతాడేమో. ముఖ్యంగా అతను తమిళంలో చేసిన పాత్రనే తెలుగులో పవన్ కళ్యాణ్ చేయగా.. దానికీ దీనికీ పొంతన లేదు. ఆ పాత్ర చాలా సీరియస్‌గా, కామ్‌గా సాగుతుంది. ఇక్కడ మాత్రం పవన్ రాకతో క్యారెక్టర్‌ని చాలా స్టైలిష్‌గా మార్చారు.
పవన్ స్వాగ్ కూడా తోడవడంతో అదొక ఎంటర్టైనర్ రోల్‌లాగా మారిపోయింది. ఇక ‘వినోదియ సిత్తం’ హార్ట్ టచింగ్‌గా ఉంటూనే ఒక ప్రవచనం లాగా అనిపిస్తే.. ఇక్కడ మాత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ కలర్ వచ్చేసింది. మరి త్రివిక్రమ్ రంగంలోకి దిగాడంటే.. ఆయన టచ్ పడిందంటే సినిమా రూపు రేఖలు మారకుండా ఎలా ఉంటాయి? ఇంతకుముందు తీన్‌మార్, భీమ్లా నాయక్ చిత్రాల్లోనూ తన మార్కు చూపించాడు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా ఆయన టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. టీజర్‌తో పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన ‘బ్రో’ జులై 28న మంచి ఫలితాన్నే అందుకుంటుందనిపిస్తోంది.
This post was last modified on June 29, 2023 10:27 pm
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…