Movie News

‘ఆదిపురుష్’ డైలాగులపై ‘ఆదిపురుష్’ నటుడే..

‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత ఆ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలను ప్రెజెంట్ చేసిన విధానం.. అలాగే అందులోని డైలాగులపై తీవ్ర విమర్శలే వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు వచ్చినా.. ఇంకా వివాదాలు, విమర్శలు ఆగట్లేదు.

తాజాగా ‘ఆదిపురుష్’కు వ్యతిరేకంగా వేసిన ఓ పిటిషన్‌ను విచారిస్తూ అలాహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయి. జనాలు వెర్రివాళ్లనుకుంటున్నారా.. ఖురాన్ మీద ఇలాంటి సినిమా తీయగలరా అంటూ కోర్టు.. ఆదిపురుష్ టీంను తీవ్రంగా మందలించింది.

కాగా ఈ సినిమాలో డైలాగుల పై స్వయంగా అందులో నటించిన నటుడే అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ నటుడి పేరు లవీ పజ్నీ. ‘ఆదిపురుష్’లో అతను కుంభకర్ణుడి పాత్రలో కనిపించాడు. ద్వితీయార్ధంలో కొన్ని నిమిషాల పాటు ఈ పాత్ర కనిపిస్తుంది.

పంజాబీ నటుడైన లవీ పజ్నీ.. ‘ఆదిపురుష్’ డైలాగుల విషయంలో ఒక హిందువుగా తాను కూడా బాధ పడ్డట్లు వెల్లడించాడు. సినిమాలో నటించేటపుడే కొన్ని డైలాగులు అభ్యంతరకరంగా అనిపించాయని.. ఇక సినిమా చూస్తూ తాను మరి కొన్ని డైలాగుల విషయంలో బాధ పడ్డానని లవీ పజ్నీ తెలిపాడు.

సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందేనని, అందుకే తాను ఏమీ అనలేకపోయానన్నారు. సినిమా విడుదల తర్వాత అభ్యంతరాల మేరకు కొన్ని డైలాగులను మార్చినప్పటికీ ఒక హిందువుగా తాను చాలా బాధపడ్డానని లవీ పజ్నీ.

ప్రభాస్ సైతం ఈ సినిమా షూటింగ్ మధ్యలో మనం చేస్తోంది కరెక్టేనా అని దర్శకుడు ఓం రౌత్ దగ్గర ప్రస్తావిస్తే.. తనను నమ్మమని చెప్పి ఓం రౌత్ సినిమాను ముందుకు తీసుకెళ్లినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

Share
Show comments
Published by
Satya
Tags: Adipurush

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

1 hour ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

2 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

2 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

2 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

3 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

4 hours ago