అప్పుడెప్పుడో పదిహేడేళ్ల క్రితం స్టాలిన్ లో చిరంజీవితో ఆడిపాడిన త్రిష మళ్ళీ ఆ తర్వాత జట్టుకట్టలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మించబోయే ఎంటర్ టైనర్ లో మరోసారి జోడిగా కనిపించనుందనే వార్త ఇప్పటికే వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో చిరుది రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. సిద్దు జొన్నలగడ్డకు తండ్రిగా కనిపిస్తారట. అయితే బలమైన ఎమోషన్లు, సెంటిమెంట్లు కానీ ఏమి లేకుండా క్లీన్ కామెడీతో ఆద్యంతం నవ్వించేలా ప్రసన్న కుమార్ కథను రాసినట్టు ఇన్ సైడ్ టాక్.
అలాంటప్పుడు త్రిష వేసేది తల్లి పాత్ర అవుతుంది. ఒకపక్క తమిళంలో లియో లాంటి సినిమాల్లో స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశాలు వస్తున్నప్పుడు టాలీవుడ్ లో వయసు మళ్ళిన క్యారెక్టర్ ఎందుకు చేస్తారనే సందేహం రావడం సహజం. ఇక్కడే ఉంది అసలు మెలిక. సిద్దుకి చిరు తండ్రే కానీ త్రిష అమ్మ కాదట. అంటే మెగాస్టార్ కు రెండో భార్యగా కావడం కోసం సిద్దు తాపత్రయపడే టైపు ట్విస్టు సెట్ చేశారని తెలిసింది. అలా అయితే ఇబ్బంది లేదు. పైగా ఎంటర్ టైన్మెంట్ ఫ్లోలో ఆ విషయం ప్రేక్షకులు గుర్తించలేనంత వేగంగా స్క్రీన్ ప్లే ఉంటుందని వినికిడి.
త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమా రిలీజ్ ని 2024 సంక్రాంతికి ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అసలు షూటింగ్ మొదలు కాకుండానే అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే లొకేషన్స్ మొత్తం హైదరాబాద్ లోనే సెట్ చేస్తారట. ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఇవేవి ఉండవు కాబట్టి స్పష్టమైన టార్గెట్ తో మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసేలా స్కెచ్ వేస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్ట్ కె వాయిదా దాదాపు లాంఛనమే కాబట్టి గుంటూరు కారంతో పాటు కర్చీఫ్ వేయాలని మెగా టీమ్ ప్లాన్. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇదేమంత కష్టం కాదు. చేరుకోవచ్చు.
This post was last modified on October 8, 2023 4:38 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…