తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని కథానాయిక అసిన్. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో తెలుగులో అడుగు పెట్టి అనేక పెద్ద సినిమాల్లో నటించిందామె. ఐతే కెరీర్ ఇంకా కొనసాగుతుండగానే ఈ మలయాళ కుట్టి మైక్రోమ్యాక్స్ మొబైల్ కంపెనీ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడటం.. అతణ్ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడటం తెలిసిందే.
2016లో ఈ జంట పెళ్లి చేసుకున్నాక అసిన్ లైమ్ లైట్లో లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు విడాకుల ప్రచారంతో అసిన్ వార్తల్లోకి వచ్చింది అసిన్. తన భర్తతో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి అసిన్ తొలగించడం ఈ ప్రచారానికి దారి తీసింది. ఐతే తాను విడాకులు తీసుకోబోతున్న వార్త నిజం కాదని అసిన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.
‘‘వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న సమయంలో కొన్ని నిరాధారమైన వార్తలు మా కంట పడ్డాయి. వాటిని చూశాక.. పెళ్లి కోసం ఇద్దరి కుటుంబాల పెద్దలను ఒప్పించిన రోజులు గుర్తుకు వచ్చాయి. మేం విడిపోతున్నామంటూ వచ్చిన వార్త్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి కాస్త ఆలోచించి వార్తలు రాయండి. అద్భుతమైన హాలిడేలో ఇలాంటి వాటి కోసం ఐదు నిమిషాలు వృథా చేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా’’ అని అసిన్ తెలిపింది.
‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తర్వాత అసిన్.. తెలుగులో నాగార్జున సరసన ‘శివమణి’.. వెంకటేష్‌కు జోడీగా ‘ఘర్షణ’.. బాలకృష్ణ సరసన ‘లక్ష్మీ నరసింహా’ లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో ఆమె చేసిన ‘గజినీ’; ‘పోకిరి’ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. హిందీలో సైతం ‘గజినీ’ రీమేక్ సహా పలు భారీ చిత్రాల్లో అసిన్ నటించింది. చివరగా ఆమె ‘హౌస్ ఫుల్-2’, ‘లండన్ డ్రీమ్స్’ చిత్రాల్లో మెరిసింది.
This post was last modified on June 28, 2023 6:52 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…