గత ఏడాది నిఖిల్ సినిమా ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రిలీజ్ ముంగిట ఆ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా పేర్కొన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల అవతల దానికి ఏమాత్రం క్రేజ్ కనిపించలేదు. ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. హిందీలో నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. కానీ విడుదల తర్వాత ఆ చిత్రానికి ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది.
పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. థియేటర్లు, షోల సంఖ్య పెరుగుతూ పోయింది. అంతిమంగా సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘స్పై’ను కూడా నిఖిల్ పాన్ ఇండియా సినిమాగానే చెబుతున్నాడు. నాలుగు భాషల్లో రిలీజ్ చేయిస్తున్నాడు. మరి ‘కార్తికేయ-2’ లాగా ఇది కూడా మ్యాజిక్ చేస్తుందా అన్నది సందేహం.
‘కార్తికేయ-2’కు అనుసరించిన స్ట్రాటజీనే ‘స్పై’ విషయంలోనూ నిఖిల్ అనుసరిస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల అవతలేమీ క్రేజ్ లేదు. నిఖిల్ సైతం రాష్ట్రాలు తిరిగి ఈ సినిమానేమీ ప్రమోట్ చేయట్లేదు. కేవలం కంటెంటే ఈ సినిమాకు ఆదరణ పెంచుతుందని నమ్ముతున్నాడు నిఖిల్. హిందీలో సినిమాకు ఢిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. వాటికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
రిలీజ్‌కు ముందు రోజు థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక తమిళంలో అయితే చెన్నై లాంటి పెద్ద సిటీలో ‘స్పై’కి వీకెండ్ అంతా కలిపి పది షోలు కూడా లేవు. ఇక మలయాళ వెర్షన్‌కు కోచి సిటీలో ఇంకా తక్కువ షోలు ఇచ్చారు. బెంగళూరులో కన్నడ వెర్షనే అందుబాటులో లేదు. తెలుగు షోలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఏపీ, తెలంగాణ అవతల ‘స్పై’ రిలీజ్ నామమాత్రమే. మరి ఈ సినిమాకు కూడా ‘కార్తికేయ-2’ లాగే పాజిటివ్ టాక్ వచ్చి.. ఆక్యుపెన్సీలు పెరిగిపోయి.. పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on June 28, 2023 5:25 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…