లేటు వయసులో ఒక్కసారిగా హాట్నెస్ పెంచేసి కుర్రాళ్లలో కాక పుట్టిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవలే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘జీ కర్దా’లో ఆమె చేసిన హాట్ సీన్లు కొన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మరో ‘హాట్’ సిరీస్‌తో తమన్నా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ఓ కీలక పాత్ర చేసిన ‘లస్ట్ స్టోరీస్-2’ ఈ గురువారమే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది.
నిజ జీవితంలో తమన్నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా భావిస్తున్న విజయ్ వర్మనే ఇందులో ఆమెతో జోడీ కొట్టాడు. ఒక ఎపిసోడ్ వీరి మీదే నడవబోతోంది. తమన్నా ఒక వివాహితగా కనిపించనుండగా.. ఆమె మాజీ లవర్ అయిన విజయ్ తన జీవితంలోకి రీఎంట్రీ ఇచ్చి తనతో మళ్లీ రొమాన్స్ చేయాలని ప్రయత్నించే నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నడుస్తుందని ప్రోమోలు చూస్తే అర్థమవుతున్నాయి.
ఈ షోను తమన్నా కొంచెం వెరైటీగా ప్రమోట్ చేయాలని చూడటం విమర్శలకు దారి తీస్తోంది. లస్ట్ స్టోరీస్-2 ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా సెక్స్ చుట్టూ తిరిగే ఇలాంటి షోలను ఫ్యామిలీ అంతా చూసేంత ప్రొగ్రెసివ్ సొసైటీ కాదు మనది. కానీ తమన్నా మాత్రం ఈ షోను ఫ్యామిలీలో అందరూ కలిసి చూడమని అంటోంది.
పైగా తనకు, విజయ్‌కి మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సీన్ చూపించి మరి.. ఈ షోను రహస్యంగా చూడాల్సిన పని లేదని.. ఇందులో అందరి కథలూ ఉంటాయని.. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని ఆమె సెలవిచ్చింది. కానీ నెటిజన్లకు ఈ అప్పీల్ రుచించలేదు. రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లను ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేంత సీన్ మన దగ్గర లేదని.. తమన్నా ఇప్పుడు ఇమేజ్ మార్చుకుని ఇలాంటి సిరీస్‌ల్లో నటిస్తే నటించింది కానీ… జనాలకు ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వొద్దని ఆమెకు గట్టిగా చెబుతున్నారు.
This post was last modified on June 28, 2023 5:08 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…