దర్శకుడిగా పెళ్లి చూపులు రూపంలో డెబ్యూతోనే మంచి సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత తీసింది ఈ నగరానికి ఏమైంది ఒకటే. రిలీజైన టైంలో బ్లాక్ బస్టర్ అనిపించుకోకపోయినా రీ రిలీజ్ మాత్రం ఓ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతోంది. ఇదేదో ముందే చూసి ఉంటే గోవాలో ఇల్లు కొనేవాడినని సోషల్ మీడియాలో డైరెక్టర్ చెప్పుకోవడం అసలు ట్విస్టు. తరుణ్ భాస్కర్ కొత్త మూవీ కీడా కోలా విడుదలకు సిద్ధమవుతోంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఈసారి కూడా టాలెంట్ నే నమ్ముకుని అంతా సపోర్టింగ్ ఆర్టిస్టులనే తీసుకున్నాడు. ఇందాకా టీజర్ వచ్చేసింది
కాన్సెప్ట్ ని ఎక్కువ రివీల్ చేయకుండా వీడియోని కట్ చేశారు. బ్రహ్మానందంకి ప్రాధాన్యం దక్కింది. నాలుగైదు గ్యాంగులు, వాళ్ళ మధ్య ఒక కోకా కోలా సీసాకు సంబంధించిన ఏదో పెద్ద రహస్యం. దీని కోసం ఛేజులు, ఫైట్లు ఆఖరికి సరదాగా మర్డర్లు కూడా జరిగిపోతాయి. బొద్దింక పడిన బాటిల్ లో అంత సీక్రెట్ ఏముందో రివీల్ చేయలేదు. క్రైమ్ కామెడీ జానర్ లో తరుణ్ భాస్కర్ ఏదో కొత్తగా ట్రై చేసిన ఇంప్రెషన్ అయితే కలిగింది. ఒకరిద్దరు తెలుసున్న మొహాలు ఉన్నప్పటికీ కంప్లీట్ గా తారాగణమే వెరైటీగా ఉంది. యూత్ లో అంచనాలు పెంచేలా తరుణ్ క్లిక్ అయ్యాడు
విజువల్స్ ఆసక్తి రేపెలా ఉన్నాయి. సంభాషణలు ఎక్కువ లేకుండా జాగ్రత్త పడ్డారు. పరస్పరం వెంటపడటం కాల్చుకోవడం తప్ప ఇంకేం లేదు. వివేక్ సాగర్ సంగీతం అందించిన కీడా కోలాకు ఏజె ఆరోన్ ఛాయాగ్రహణం సమకూర్చారు. రైటింగ్ టీమ్ పెద్దదే ఉంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ జూలైలోనే ఉంటుంది. తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్ లోనే సాగిన ఈ కీడా కోలా టైటిల్ తో మొదలుపెట్టి టీజర్ దాకా అన్నీ వినూత్నంగానే చేసింది. యూత్ ఫుల్ థ్రిల్లర్లు తగ్గిపోతున్న టైంలో ఇది కనక వర్కౌట్ అయితే తరుణ్ భాస్కర్ మళ్ళీ ట్రాక్ లో పడ్డట్టే.
This post was last modified on June 28, 2023 2:47 pm
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎదురుకున్న ఇబ్బందులు, వేరొకరితో నేపధ్య సంగీతం…