ఇండియన్ సినిమాలకు ఇప్పుడు పెద్ద బెంచ్ మార్క్ వంద కోట్లుగా ఉంది. తొలి రోజు కొన్ని భారీ చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నాయి. ప్రభాస్ కొత్త చిత్రం ఆదిపురుష్ ఇటీవల తొలి రోజు రూ.140 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. ఐతే ప్రభాస్ రాబోయే సినిమా ప్రాజెక్ట్ కే ఏకంగా తొలి రోజే రూ.500 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆ సినిమా మేకింగ్ చూసి తనకు ఆ ధీమా కలుగుతున్నట్లు ఆయన చెప్పారు.
ఇటీవల రెండు సార్లు తాను ‘ప్రాజెక్ట్ K’ సెట్స్‌కి వెళ్లానని.. వాళ్తు తీస్తున్న విధానం బాగుందని తమ్మారెడ్డి అన్నారు. సరైన పద్ధతిలో ప్రచారం చేస్తే ఈ సినిమా గ్లోబల్ స్టాయిలో టాప్-50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. అది వైజయంతీ మూవీస్ ప్రచార కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. సరైన పద్ధతిలో ప్రమోట్ చేస్తే తొలి రోజు ఈ సినిమా రూ.500 నుంచి రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందన్నారు తమ్మారెడ్డి. సినిమా బాగుంటే కచ్చితంగా హాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలుగులో ఒకప్పుడు రూ.30 కోట్లు, రూ.40 కోట్లు వస్తే చాలా ఎక్కువ అనుకునేవాళ్లమని.. ‘ఇంద్ర’ సినిమాకు రూ.30 కోట్లు వస్తే గ్రాండ్‌గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు.. చిరు రేంజికి రూ.100 కోట్ల వసూళ్లు రావాలని ఆయన దగ్గర అన్నానని.. కానీ అది చాలా కష్టం అనుకుంటే.. ‘బాహుబలి’తో రాజమౌళి రూ.1000 కోట్లు చాలా ఈజీగా రాబట్టి చూపించాడని… ‘కె.జి.యఫ్’, ‘కె.జి.యఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు కూడా భారీగా వసూళ్లు రాబట్టాయని..ప్రాజెక్ట్ కే వీటన్నింటినీ మించి ప్రపంచ స్థాయిలో వేల కోట్లు వసూలు చేస్తుందని తమ్మారెడ్డి అన్నారు.
This post was last modified on June 27, 2023 11:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…