ఆదిపురుష్.. ఈ మధ్య కాలంలో తీవ్ర వివాదాస్పదమైన సినిమా. టీజర్ రిలీజైనపుడే ఈ సినిమా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది కానీ.. తర్వాత ఎలాగోలా ఆ నెగెటివిటీని జయించారు. రిలీజ్ ముంగిట మంచి బజ్ తీసుకురాగలిగారు. కానీ రిలీజ్ తర్వాత సినిమా తీవ్రాతి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమాలో రావణుడు సహా వివిధ పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరు.. అనేక సన్నివేశాలు.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రామాయాణాన్ని చెడగొట్టారనే చర్చ నడిచింది. వీకెండ్ వరకు సత్తా చాటిన ఈ చిత్రం ఆ తర్వాత ఈ నెగెటివిటీని తట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టు కేసులు కూడా చిత్ర బృందానికి తలపోటుగా మారాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ మీద విచారించిన కోర్టు.. ఆదిపురుష్ టీం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు బుర్ర లేని వాళ్లు అనుకుంటున్నారా అంటూ మేకర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సినిమా చూశాక కూడా ప్రజలు లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ రానివ్వలేదు అంటే ప్రజలని మెచ్చుకోవాలి అని కోర్టు వ్యాఖ్యానించింది. హనుమంతుడిని సీతని దేనికి పనికిరాని వాళ్లలాగా చూపించారని కోర్టు వ్యాఖ్యానించింది.
అంతే కాక సినిమాలో డైలాగ్స్ మార్చడంపై స్పందిస్తూ.. మరి సీన్లు ఎవరు మారుస్తారు అని ప్రశ్నించింది. రాముడిని, రావణుడిని, లంకని, ఆంజనేయుడిని చూపించి ఇది రామాయణం కాదు అంటే చూసే ప్రజలు బుర్రలేని వాళ్ళు అనుకున్నార్రా అని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఐతే ఆదిపురుష్ టీం మీద కోర్టు చర్యలేమీ సూచించలేదు. మందలింపుతో సరిపెట్టినట్లుగా తెలుస్తోంది. అయినా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిన చిత్రంపై ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండకపోవచ్చు.
This post was last modified on June 27, 2023 11:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…