ఎల్లుండి విడుదల కాబోతున్న స్పై ప్యాన్ ఇండియా రిలీజ్ కు సర్వం సిద్ధం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ పరుగులు పెట్టకపోయినా మౌత్ టాక్ తో మొదటి రోజు మ్యాట్నీకే కలెక్షన్లు ఊపందుకుంటాయనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ముందస్తు అమ్మకాలు బాగున్నాయి. నార్త్ లో సత్యప్రేమ్ కి కథ వల్ల పోటీ తప్పలేదు కానీ మిగిలిన చోట్ల మాత్రం మంచి బజ్ ఉంది. ఏపీ తెలంగాణలో ఆ రోజు శ్రీవిష్ణు సామజవరగమన మాత్రమే పోటీగా ఉంది కాబట్టి స్పైకు వచ్చిన టెన్షన్ ఏమి లేదు. ఎటొచ్చి ఆదిపురుష్ ఆల్రెడీ స్లో అయిపోయింది.
బిజినెస్ పరంగానూ స్పై ప్లానింగ్ చక్కగా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను 17 కోట్ల 50 లక్షల దాకా విక్రయించినట్టు సమాచారం. దీనిపైన ఇంకో కోటి అదనంగా షేర్ వస్తే ఈజీగా గట్టెక్కపోతుంది. స్పైకి కలిసి వస్తున్న సానుకూలంశాలు చాలా ఉన్నాయి. మొదటిది 29న బక్రీద్ నేషనల్ హాలిడే. ఆపై మూడు రోజుల లాంగ్ వీకెండ్ దక్కుతుంది. చివరి శనివారం కావడంతో బ్యాంకుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవులు ఉంటాయి. కార్పొరేట్ల సంగతి సరేసరి. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం రికవరీని తక్కువ టైంలో అంటే వారం పది రోజుల్లో ఆశించవచ్చు.
తెలంగాణలో గరిష్ఠ టికెట్ ధరలకు మొగ్గు చూపినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో అదేమీ ఇబ్బంది కాదనే ధీమాలో స్పై బృందం ఉంది. నైజామ్ రైట్స్ కి 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఓవర్సీస్ కోటి డెబ్భై ఐదు లక్షలు, ఇతర రాష్ట్రాలు70 లక్షలకు ఇచ్చారు. ఆంధ్ర ఏకంగా 6 కోట్లు పలకడం విశేషం. సుభాష్ చంద్రబోస్ అంతర్ధానం మీద యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన స్పై మీద నిఖిల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ట్రైలర్ కట్ బాగా రీచ్ అయ్యింది. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా పరిచయమవుతున్న స్పై అడవి శేష్ గూఢచారి తరహాలో ట్రెండ్ సెట్టింగ్ హిట్టవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 27, 2023 4:09 pm
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…