Movie News

ట్రైలర్: వజ్రపు రింగు కోసం పరుగో పరుగు

మత్తువదలరాతో పేరు తెచ్చుకుని మళ్ళీ అలాంటి సక్సెస్ కోసమే ఎదురు చూస్తున్న కుర్ర హీరో శ్రీసింహ కొత్త సినిమా భాగ్ సాలే వచ్చే నెల 7న విడుదల కాబోతోంది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ గురించి కొద్దిరోజుల క్రితమే సిద్దు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఒక డైమండ్ చుట్టూ తిరిగే కథగా  భాగ్ సాలే ఉంటుందని స్పష్టంగా క్లూస్ ఇచ్చేశారు. ఇవాళ కార్తికేయ హీరోగా ట్రైలర్ లంచ్ జరిగింది. కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ మూవీని అర్జున్ దశ్యన్ – యష్ రంగినేని – సింగనమల కళ్యాణ్  లు సంయుక్తంగా నిర్మించారు

అర్జున్(శ్రీసింహ కోడూరి) ఒక మంచి ఛెఫ్. వంట వండితే ఎలాంటి వారైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే. మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇతనికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి(నేహా సోలంకి)తో లవ్ ఎఫైర్ ఉంటుంది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న టైంలో అర్జున్ జీవితంలోకి ఒక విలన్(జాన్ విజయ్)వస్తాడు. డైమండ్ పొదిగిన ఒక విలువైన రింగు కోసం ఎక్కడెక్కడో తిరిగి దానితో అర్జున్ ఫ్యామిలీకి లింక్ ఉందని గుర్తించి వీళ్ళ వెంటపడతాడు. మ్యాటర్ లేట్ గా అర్థం చేసుకున్న అర్జున్ అక్కడి నుంచి ఫ్రెండ్స్ తో కలిసి తప్పించుకునే రేస్ మొదలుపెడతాడు. అదే భాగ్ సాలే

కంప్లీట్ కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రణీత్ సాయి దీన్ని రూపొందించినట్టు వీడియోలో స్పష్టంగా చెప్పేశారు. ఒక విలువైన వస్తువు గురించి ఛేజులు జరిగే కాన్సెప్ట్ కొత్త కాకపోయినా మంచి ఫన్ తో నవ్విస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని గతంలో ప్రూవ్ అయ్యింది కాబట్టి ఆ నమ్మకంతోనే భాగ్ సాలే తీశారు. వైవా హర్ష, రాజీవ్ కనకాల, థర్టీ ఇయర్స్ పృథ్వి తదితరులతో సపోర్టింగ్ క్యాస్ట్ పెద్దగానే ఉంది. ఆర్ఆర్ఆర్ రెఫరెన్సులు వాడేశారు. యూత్ అండ్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకున్న భాగ్ సాలే 2023 ద్వితీయార్థంలో ఎలాంటి బోణీ ఇస్తుందో చూడాలి

This post was last modified on June 26, 2023 3:40 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

42 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago