ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటైన ప్రాజెక్ట్-కే సినిమాకు సంబంధించి ఈ రోజు బిగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కమల్ ఈ ప్రాజెక్టులో భాగం కావడం పట్ల ప్రభాస్ తన ఎగ్జైట్మెంట్‌ను బయట పెట్టాడు. కమల్ సైతం ఈ సినిమా చేస్తుండటం తన అదృష్టం అన్నట్లుగా మాట్లాడాడు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్, దీపికా పదుకొనే లాంటి పేరు మోసిన హీరోయిన్ ఉండటంతో ఈ సినిమా లెవెలే వేరుగా ఉంది. ఇప్పుడు కమల్ కూడా రావడంతో సినిమా స్కేల్ ఇంకా పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇంతకీ ఈ చిత్రంలో కమల్ పాత్రేంటి అనే విషయంలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో ఆయన విలన్ పాత్ర చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
సినిమాలో అమితాబ్ బచ్చన్ విలన్ పాత్ర చేసే అవకాశం దాదాపుగా లేనట్లే. ఆయనది ప్రభాస్‌ను వెనక ఉండి నడిపించే మెంటార్ తరహా సైంటిస్టు పాత్రగా చెబుతున్నారు. ఐతే సైంటిస్టులైన కమల్, అమితాబ్ కలిసి ఒక అద్భుతం లాంటి ఆవిష్కరణ చేస్తారని.. దాన్ని మానవాళి మంచికి ఉపయోగించాలన్నది అమితాబ్ ఉద్దేశమైతే.. దాన్ని కమల్ ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తాడట.
ఆ పరిస్థితుల్లో ప్రభాస్‌ను ఒక ఆయుధంలో కమల్ మీదికి అమితాబ్ ప్రయోగిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. కాన్సెప్ట్ విషయంలో ఈ ప్రచారం ఎంత వరకు నిజమో కానీ.. కమల్ నెగెటివ్ షేడ్స్‌ను కూడా గొప్పగా పండించగలడు కాబట్టి ఆయన విలన్ పాత్ర చేస్తే ఆ పాత్రకు వచ్చే ఎలివేషనే వేరుగా ఉంటుందని.. కమల్ లాంటి విలన్‌ను ఢీకొడితే ప్రభాస్ పాత్ర కూడా షైన్ అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates