మధ్యతరగతి యువకుడి షాకుల జీవితం

వెరైటీ కథలు, ప్రయోగాలతో పాటు ప్రేక్షకుల మెప్పులు పొందుతాడని పేరున్న శ్రీవిష్ణు కొత్త సినిమా సామజవరగమన ఈ శుక్రవారమే థియేటర్లలో అడుగు పెట్టనుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ ట్రైలర్ ని ఇవాళ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. టీమ్ ప్రత్యేకంగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నిజానికీ మూవీ మొన్న నెలే రావాల్సి ఉన్నా పోటీ తదితర కారణాల వల్ల కాస్త లేట్ అయ్యింది. ఇంతకీ ట్రైలర్ లో కంటెంట్ ఆసక్తి పెంచేలా ఉందా .

మల్టీప్లెక్సులో పనిచేసే బాక్సాఫీస్ బాలు(శ్రీవిష్ణు) మధ్యతరగతి జీవి. కుటుంబ సభ్యులు సినిమాకు వచ్చినా సరే కనీసం పాప్ కార్న్ టబ్బు కొనాలన్నా నో అనే రకం. మహా పిసినారి. అలాంటి వాడి లైఫ్ లోకి, ఇంట్లోకి  ఓ అందమైన అమ్మాయి(రెబ జాన్)వస్తుంది. రావడమే ఖర్చులతో మోత మోగిస్తుంది. ఆమెకు బాలు తండ్రి(నరేష్) తోడవ్వడంతో డబ్బులు మంచి నీళ్లలా ఖర్చయిపోతూ ఉంటాయి. ఇది కాకుండా పరిచయమైన ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకునే అలవాటున్న బాలు హీరోయిన్ కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చాడనేది తెరమీద చూడాలి

ట్రైలర్ కట్ ఫన్నీగా ఉంది. బరువైన ఎమోషన్లు, హెవీ ఫైట్లు లేకుండా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రామ్ అబ్బరాజు తీసుకున్న పాయింట్ డిఫరెంట్ గానే అనిపిస్తోంది. మూడు రోజుల ముందే ప్రీమియర్లు కూడా ప్లాన్ చేసుకున్న సామజవరగమనకు ఈ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం, రామ్ రెడ్డి ఛాయాగ్రహణం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సమకూర్చిన ఈ కామెడీ మూవీ సక్సెస్ కావడం శ్రీవిష్ణుకి చాలా కీలకం. అందుకే ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నాడు. 29న స్పైతో తెలుగులో పోటీ పడాల్సి ఉంటుంది  

Samajavaragamana Trailer | Sree Vishnu | Reba John | Ram Abbaraju | Gopi Sundar | Anil Sunkara