విడుదల ముందు రోజు కొత్త సినిమాలకు ప్రీమియర్లు వేయడం గత రెండేళ్లలో సాధారణం అయిపోయింది. అయితే మూడు రోజులు ముందుగా స్పెషల్ షోలు వేయడం మాత్రం అరుదు. శ్రీవిష్ణు కొత్త మూవీ సామజవరగమన ఈ నెల 29 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన కేంద్రాల్లో సోమవారం సాయంత్రమే స్క్రీనింగ్స్ వేయబోతున్నారు. అది కూడా ఒక్క షో మాత్రమే. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కడప, తిరుపతిలో ఒకేసారి 7.30 గంటలకు ప్రీమియర్లు మొదలవుతాయి.
తెలంగాణకు సంబంధించి ఇంకా థియేటర్ల లిస్టు రావాల్సి ఉంది. సమర్పకులు అనిల్ సుంకర తన భోళా శంకర్ హీరో చిరంజీవితో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఎంటర్ టైనర్ గా రూపొందిన సామజవరగమనకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎర్లీ ప్రీమియర్లు వేయడం చూస్తే కంటెంట్ మీద నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది. 29నే నిఖిల్ స్పైని ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాని పోటీని తట్టుకోవాలంటే సామజవరగమన ప్రమోషన్ స్పీడ్ తో పాటు ఇలాంటి ఎత్తుగడలు వేయాల్సిందే. అందుకే ఈ రూటు పట్టారు .
గతంలో మేజర్, 777 ఛార్లీ, మేం ఫేమస్, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే ఫలితం దక్కింది. అందుకే సామజవరగమనకు మంచి ఛాన్స్ దక్కింది. రాజరాజచోర తర్వాత మూడు ఫ్లాపులతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు బాక్సాఫీస్ వద్ద గ్యాప్ ని వాడుకోవాలి. స్పై బాగున్నా సరే రెండో ఆప్షన్ గా ఆడియన్స్ దీనివైపే చూస్తారు. ఎలాగూ ఆదిపురుష్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. తిరిగి జూలై 7 దాకా స్పేస్ దక్కుతుంది. అప్పుడూ భారీ చిత్రలేం లేవు. కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈజీగా నిలదొక్కుకోవచ్చు. చూడాలి మరి
This post was last modified on June 25, 2023 9:33 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…