సినిమా ఇండస్ట్రీలో అయినా, రాజకీయ రంగంలో అయినా బండ్ల గణేష్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎక్కడైనా ఆయన హడావుడి మామూలుగా ఉండదు. ఒకప్పుడు కమెడియన్‌గా వందల్లో సినిమాలు చేసి.. ఉన్నట్లుండి నిర్మాతగా అవతారం ఎత్తి వరుసగా భారీ చిత్రాలు నిర్మించాడు బండ్ల. కానీ తర్వాత ఉన్నట్లుండి ప్రొడక్షన్ ఆపేసి కూర్చున్నాడు. ఆ టైంలోనే రాజకీయాల వైపు మనసు మళ్లి 2019 ఎన్నికల ముంగిట రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.
అప్పుడు బండ్ల చేసిన హడావుడి చూస్తే తనకు టికెట్ వస్తుందని, ఎమ్మెల్యే కూడా అయిపోతాడని అనిపించింది చాలామందికి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పైగా ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. నాకు రాజకీయాలు సరిపోవంటూ కాడి దించేసి.. కొన్నేళ్లుగా సైలెంటుగా ఉంటున్నాడు బండ్ల. కానీ మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి బండ్లకు తిరిగి రాజకీయాలపై మనసు మళ్లినట్లుంది.
తెలంగాణలో బీజేపీ కొంచెం డౌన్ అయి.. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండంతో మళ్లీ బండ్ల ఆ పార్టీలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని బండ్ల ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తెలంగాణలో పాద యాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు మద్దతుగా తాను రంగంలోకి దిగనున్నట్లు బండ్ల తెలిపాడు. ‘‘అన్నావస్తున్నా. అడుగులో అడుగేస్తా. చేతిలో చెయ్యేస్తా.
కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’’ అని భట్టి విక్రమార్కను ఉద్దేశించి బండ్ల ట్వీట్ చేశాడు. బండ్ల తీరు చూస్తుంటే ఏదో నామమాత్రంగా ఈ యాత్రలో పాల్గొనేట్లు లేడు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యేలాగే కనిపిస్తున్నాడు. మరి ఈసారైనా అధిష్టానాన్ని మెప్పించి టికెట్ సంపాదిస్తాడేమో చూడాలి.
This post was last modified on June 25, 2023 9:14 pm
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…