కొందరు స్టార్ హీరోలకు ఎలాంటి భేషజాలు ఉండవు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే వాళ్ళుంటారు. ఎవరో చెబితే కానీ బయట ప్రపంచానికి తెలియదు. అందులో సూర్య ఒకరు. జై భీమ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జ్ఞానవేల్ ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్న జ్ఞాపకాలు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈయన సినిమాల్లోకి రావడానికి ముందు పిహెచ్డి పూర్తి చేసి ఆనంద వికటన్ పత్రికకు జర్నలిస్టు నుంచి బ్యూరో చీఫ్ వరకు ఎదిగాడు. ఎడిటర్ గా ప్రమోషన్ వస్తున్న టైంలో ఆ వృత్తి నుంచి సెలవు తీసుకుని సినిమాల వైపు మళ్లాడు.
వృత్తిలో భాగంగా ఎందరో హీరోలు, నటులతో జ్ఞానవేల్ కు మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. స్నేహితులతో కలిసి అనాధ పిల్లల కోసం ఓ ఎన్జిఓ ఫౌండేషన్ పెట్టి వాళ్ళ చదువుకు సహాయం చేసేవాడు. ఫ్రెండ్స్ లో ఒకరైన సూర్యకు ఇది తెలిసి ఎంత వద్దంటున్నా 2 లక్షల రూపాయల విరాళం అందించాడు. అయితే ఇది అందరికీ చేరాలనే ఉద్దేశంతో అగరం ఫౌండేషన్ స్థాపించి ఆ బాధ్యతను జ్ఞానవేల్ కు అప్పగించాడు. దర్శకుడిగా తొలి సినిమా ఫ్లాప్ అయినా జై భీమ్ కథ వినగానే తానే హీరోగా నటించి నిర్మిస్తానని ముందుకొచ్చి పూర్తి చేశారు. ప్రైమ్ లో వచ్చాక అది సృష్టించిన చరిత్ర తెలిసిందే.
ఒకవేళ సూర్య కనక స్నేహితుడి ప్రతిభను గుర్థించి ఉండకపోతే జ్ఞానవేల్ ప్రయాణం ఇక్కడి దాకా వచ్చేదే కాదు. ఆస్కార్ రేంజ్ లో సినిమా తీశారని ప్రశంసలు దక్కేవి కాదు. ఇపుడా స్నేహమే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన 170 సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తెచ్చింది. అంతే కాదు 34 సంవత్సరాల తర్వాత రజని అమితాబ్ బచ్చన్ కలయికను సాధ్యం చేసింది. ఇంతకన్నా ఒక ఫిలిం మేకర్ కు కావాల్సిన అదృష్టం ఏముంటుంది. జై భీమ్ సూర్య చేయకపోతే ఇంకో హీరో నటించేవాడేమో. కానీ ఇంత రీచ్, సక్సెస్ వచ్చేది కాదనేది ముమ్మాటికీ సత్యం
This post was last modified on June 25, 2023 1:13 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…