Movie News

వర్మ నోట ఇలాంటి మాటలా.. హవ్వా

రామ్ గోపాల్ వర్మను ఈ మధ్య నాగార్జున యూనివర్శిటీకి అతిథిగా ఆహ్వానిస్తే.. విద్యార్థుల ముందు ఎలాంటి మాటలు మాట్లాడాడో తెలిసిందే. ఏమనిపిస్తే అది చేయండి.. సెక్స్ చేయాలనిపిస్తే చేయండి.. చదువు, మార్కుల సంగతి తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయండి.. నేను భూమి మీదే రంభ, మేనక, ఊర్వశిలతో ఎంజాయ్ చేస్తా.. ఏదైనా వైరస్ వచ్చి నేను తప్ప భూమి మీద ఉన్న మగాళ్లందరూ చనిపోవాలి.. విద్యార్థులను ముందు పెట్టుకుని ఇలాంటి పైత్యంతో కూడిన వ్యాఖ్యలు చాలానే చేసి ఈయన్నెందుకు పిలిచాం అని నిర్వాహకులు తలలు పట్టుకునేలా చేశాడు.

సోషల్ మీడియాలో వర్మను ఫాలో అయ్యే వాళ్లకు ఈ వ్యాఖ్యలు కొత్తేమీ కాదు కానీ.. ఒక యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక సోషల్ మీడియాలో ఆయన మాట్లాడే మాటలు, చేష్టలు ఎంత దిగజారుడు స్థాయికి చేరుకున్నాయో కూడా అందరూ చూస్లూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను పచ్చి బూతు మాట అనిపించి.. విషయం బయటపడ్డాక దాన్ని కూడా కవర్ చేసుకున్న ఘనుడు ఆర్జీవీ. అలాంటి వ్యక్తి ఇప్పుడు యువత గురించి, పిల్లల గురించి తెగ బాధ పడిపోతూ.. పెట్టిన ట్విట్టర్ పోస్టు అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 

‘‘చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకొస్తే  పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వొలిచేస్తా లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ  దేశంలో ఎవరూ అనుండరు. హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్‌తో సహా. ఇంకో విషయమేంటంటే అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే.. ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్‌కి డైరెక్ట్‌గా ఇంత బ్రూటల్ వయోలెన్స్‌ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం.

ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ, అరుస్తూ ఉంటే ఆ మీటింగ్‌లకు వచ్చే  యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ పవన్ కళ్యాణ్‌కే తెలియాలి. పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్‌లో పిల్లలతో పాటు టీవీ చూస్తుండగా’’.. ఇదీ వర్మ ట్వీట్. బేసిగ్గా వర్మ ఏంటో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇలా యువత, పిల్లల గురించి ఆలోచించి.. పవన్ కళ్యాణ్ అనని మాటలను కూడా ఆయనకు ఆపాదించి నీతులు చెప్పడం.. అది కూడా బూతులకు, బెదిరింపులకు పెట్టింది పేరైన వైసీపీకి సపోర్ట్ చేస్తూ పవన్‌ను టార్గెట్ చేయడం వింతల్లోకెల్లా వింత.

This post was last modified on June 25, 2023 12:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

59 minutes ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

2 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

3 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

4 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

5 hours ago