నిన్న విడుదలైనవన్నీ చిన్న సినిమాలే కావడంతో ఓపెనింగ్స్ మీద ట్రేడ్ పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు. ఏదైనా పబ్లిక్ టాక్ వల్ల మెల్లగా పికప్ అవుతాయనే నమ్మకంతో ఎదురు చూశారు. అందులో భీమదేవరపల్లి బ్రాంచి ఒకటి. బేవార్స్ తో దర్శకుడిగా మారిన రమేష్ చెప్పాల దీన్ని రూపొందించారు. బలగం తర్వాత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోందని గుర్తించిన నిర్మాతలు తక్కువ బడ్జెట్ లో తీసినవాటిని రిస్క్ అయినా సరే థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ మధ్య పరేషాన్, ఇంటింటి రామాయణం కూడా ఇదే కోవలో వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక కథ విషయానికి వస్తే భీమదేవరపల్లి గ్రామంలో చావులకు డప్పులు కొట్టే జంపన్న(అంజి)కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకులో జన్ ధన్ ఖాతా తెరుస్తాడు. ఓ రోజు తల్లి అకౌంట్ లో 15 లక్షలు పడటంతో అది ప్రభుత్వమే ఇచ్చిందని భావించి విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలుపెడతాడు. దాంట్లో కొంత పెట్టుబడిగా తీసుకుని కొన్న పెట్రోల్ బావి పీతి బావని తెలిసి మోసపోతాడు. తీరా డబ్బులైపోయే సమయానికి అవి పొరపాటుగా పడ్డ సొమ్ములని వెనక్కు ఇచ్చేయమని నోటీసు వస్తుంది. దీంతో హతాశుడైన జంపన్న ఈ గండం నుంచి బయట పడేందుకు ఏం చేశాడన్నది అసలు స్టోరీ
పూర్తిగా తెలంగాణ నేటివిటీ, బాష మీద ఆధారపడి తీసిన చిత్రమిది. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా టైం పాస్ చేయించినా రెండో సగంలో దర్శకుడు రమేష్ చేతులెత్తేయడంతో కథనం నత్తనడక సాగి నవ్వించలేక, ఎమోషన్స్ పండించలేక ఫైనల్ గా అసంతృప్తి మిగిలిస్తుంది. పొరపాటుగా డబ్బులు పడటాన్ని మీడియా ఏదో జాతీయ సమస్యలా కవర్ చేసిందని చూపించడం అతిశయోక్తిగా ఉంది. ఒక పుకారు పల్లె ప్రజల అమాయకత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిందనే పాయింట్ బాగున్నప్పటికీ కథనంలో బలం లేక తేలిపోయింది. ఇద్దరు ముగ్గురు తప్ప క్యాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యింది. డ్రామాని నేటివిటీ డామినేట్ చేయడంతో బ్రాంచి పనితనం ఆకట్టుకోలేదు
This post was last modified on June 25, 2023 12:10 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…