మహేష్ బాబు కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. రాజమౌళితో చేయబోయే చిత్రం మరో ఎత్తు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. పుష్కరం కిందటే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కుదరలేదు. ఐతే ఈ ఆలస్యం కూడా మంచికే అయింది. ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించిన సమయంలో రాజమౌళితో సినిమా చేయబోతుండటం మహేష్ అదృష్టం అనే చెప్పాలి.
ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి కథ తయారీ పని నడుస్తోంది. ఎప్పట్లాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ ఫిలిం అని రాజమౌళి ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కథ గురించి మరికొన్ని విశేషాలు చెప్పారు. మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండియానా జోన్స్‌తో పాటు మరో చిత్రం ఛాయలు కూడా ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆ చిత్రమే.. 1981లో విడుదలైన రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. ఇది కూడా అడ్వెంచరస్ ఫిలిమే. దీన్ని లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్‌బర్గ్ తీశాడు. ఇక తమ స్క్రిప్టు పనులు జులైకల్లా పూర్తవుతాయని వెల్లడించిన విజయేంద్ర.. ఈ చిత్రంలో థ్రిల్‌తో పాటు బోలెడంత ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కథను ముగించకుండా.. క్లైమాక్స్‌ను ఓపెన్‌గా వదిలేస్తున్నామని.. సీక్వెల్‌కు స్కోప్ ఉంటుందని విజయేంద్ర చెప్పడం విశేషం. దీన్ని బట్టి మహేష్, రాజమౌళి మళ్లీ కలిసి సినిమా చేయొచ్చన్నమాట. ఈ చిత్రానికి మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ప్రారంభోత్సవ వేడుక చేస్తారని అంటున్నారు. షూటింగ్ వచ్చే ఏడాదే మొదలయ్యే అవకాశముంది. స్క్రిప్టు లాక్ అయ్యాక ప్రి ప్రొడక్షన్ పనులకు ఆరు నెలలకు పైగానే సమయం పట్టొచ్చు.
This post was last modified on June 25, 2023 10:36 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…