ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకం సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. దీని బారిన పడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ని ఊపేసిన కేసులో ఎందరో స్టార్లు డైరెక్టర్లు విచారణ పేరుతో గంటల తరబడి అధికారుల ఇన్వెస్టిగేషన్ ని ఎదురుకున్నారు. గత రెండు రోజులుగా మళ్ళీ ఈ ఇష్యూ చర్చలోకి వచ్చింది. కొందరు చిన్న ఆర్టిస్టులు ఈ స్కామ్ లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మళ్ళీ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అయితే ఎవరూ దీని గురించి స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. తాజాగా నిఖిల్ డ్రగ్స్ మీద ఓపెనయ్యాడు.
హైదరాబాద్ లో నిర్వహించిన అవేర్ నెస్ (అవగాహన) సభలో మాట్లాడుతూ సంచలనాత్మకమైన విషయాలు చెప్పాడు. తనకూ మాదకద్రవ్యాలు ఆఫర్ చేశారని, అయితే వాటిని తిరస్కరించడం వల్లే హ్యాపీ డేస్ వచ్చాయని, నార్కొటిక్స్ కి నో చెప్పడం వల్లే కార్తికేయ లాంటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నానని పేర్కొన్నాడు. చిన్నపిల్లలు, టీనేజర్లు వాటి బారిన పడకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళేం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హితవు పలికాడు. జీవితాలు నాశనం చేసే ప్రమాదం వాటిలో ఉందని హెచ్చరిక చేశాడు.
నిఖిల్ తో పాటు ప్రియదర్శి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఎలాంటి అడ్డుతెర లేకుండా నిఖిల్ చేసిన కామెంట్స్ నిజంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయాలే. విశాఖ నుంచి పంజాబ్ దాకా డ్రగ్స్ వల్ల విలువైన జీవితాలు, ప్రాణాలు కోల్పోయిన యువత లక్షల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి బారిన పడిన కాలేజీ కుర్రాళ్ళ సంఖ్యా వేలల్లో ఉంటోంది. వీటిని అరికట్టే బాధత్య పోలీసులు, ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడికి ఉందన్న నిఖిల్ తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక హీరో ఇంత బాహాటంగా డ్రగ్స్ గురించి చెప్పడం అరుదే
This post was last modified on June 24, 2023 11:55 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…