టాలీవుడ్లో ఇప్పుడు స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఏడాది నుంచి ఇది నడుస్తోంది. ఈ రీ రిలీజ్ సినిమాల్లో ఎక్కువగా జనాలను ఆకర్షించిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ మూవీస్ అనే చెప్పాలి. జల్సా, ఖుషి సినిమాలకు అభిమానుల నుంచి అదిరే స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు పవన్ కెరీర్లో మరో కల్ట్ మూవీ అయిన ‘తొలి ప్రేమ’ను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ నెల 29కి ఈ సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దీన్ని మళ్లీ స్పెషల్ షోల రూపంలో అభిమానుల ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు ‘తొలి ప్రేమ’ దర్శకుడు కరుణాకరన్‌తో పాటు ఈ చిత్రాన్ని అప్పట్లో నైజాం ఏరియాలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన ప్రస్తుత అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా రావడం విశేషం. ఈ సందర్భంగా ‘తొలి ప్రేమ’తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘తొలి ప్రేమ చాలామందికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాను. నా జీవితాన్ని ఒక పుస్తకం లాగా రాస్తే అందులో ‘తొలి ప్రేమ’కు ఒక ఫుల్ పేజీ తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసినప్పటికీ తొలి ప్రేమ చాలా ప్రత్యేకమైంది.
ఈ సినిమా వందో రోజు నాడు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. మామూలుగా అయితే ఆ రోజు ఎవరూ సినిమాలకు రారు. కానీ అప్పుడు కూడా తొలి ప్రేమ చూసేందుకు సంధ్య థియేటర్ దగ్గరికి జనం పెద్ద ఎత్తున వచ్చారు. ఇలాంటివి జరగడం ఒక చరిత్ర. ఈ సినమా డిస్ట్రిబ్యూషన్ నాకు ఐదేళ్లకు ఇచ్చారు. నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్న ప్రతిసారీ ‘తొలి ప్రేమ’ను రీ రిలీజ్ చేసేవాడిని. ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఒక రకంగా ‘తొలి ప్రేమ’ కూడా కారణం’’ అని దిల్ రాజు ఉద్వేగంతో చెప్పారు.
This post was last modified on June 24, 2023 11:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…