మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ మీద భారీ అంచనాలేం లేని టైంలో అందరి కళ్ళు టీజర్ మీదే ఉన్నాయి. డైరెక్టర్ ట్రాక్ రికార్డుతో పాటు వేదాళం రీమేకనే విషయం షూటింగ్ టైం నుంచే నెగటివిటీని తెచ్చి పెట్టింది. వాటిని కొంచెమైనా బ్యాలన్స్ చేస్తుందనే నమ్మకంతో అభిమానులు ఈ వీడియో కోసం ఎదురు చూశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ తో తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన కేంద్రాల్లో ఈ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. మరి నిమిషంన్నర వీడియోలో రమేష్ అండ్ టీమ్ ఏం చెప్పిందంటే
కోల్కతా నగరంలో ముప్పై ఆరు మందిని ఒకేసారి చంపేస్తాడు భోళా శంకర్(చిరంజీవి). కానీ హత్యలు చేసింది అతననే విషయం తెలియని పోలీస్ డిపార్ట్ మెంట్ వేటను ముమ్మరం చేస్తుంది. చెల్లెలు(కీర్తి సురేష్), లాయర్ ప్రియురాలు(తమన్నా)తో హాయిగా గడిచిపోతున్న శంకర్ జీవితంలోకి పాత శత్రువు(తరుణ్ అరోరా)వస్తాడు. అక్కడి నుంచి కొత్త హింస కాండ మొదలవుతుంది. అసలు శంకర్ ఆ నగరానికి ఎందుకు వచ్చాడు, టాక్సీ డ్రైవర్ గా అవతారం ఎత్తి ఎందుకు మర్డర్ల దారి పట్టాడు లాంటి ప్రశ్నలకు సమాధానం ఇంకాస్త బెటర్ గా ట్రైలర్ వచ్చాక క్లారిటీ రావొచ్చు.
వాల్తేరు వీరయ్యలాగే ఇది కూడా టోటల్ మాస్ మెగాస్టార్ నే చూపించింది. ఒరిజినల్ వెర్షన్ కి పెద్దగా మార్పులు చేసినట్టు కనిపించలేదు. ఖైదీ నెంబర్ 150 విలన్ ని మళ్ళీ రిపీట్ చేశారు. కీర్తిసురేష్, తమన్నాలతో పాటు సుశాంత్ ని ఒక ఫ్రేమ్ లో రివీల్ చేశారు. రెగ్యులర్ ఫార్ములాతో సాగే ఈ కథలో చిరు ఫ్యాన్స్ ని ఉద్దేశించి హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్, షికారుకొచ్చిన షేర్ ని బె లాంటి డైలాగులు కమర్షియల్ మీటర్ లో ఉన్నాయి. మహతి స్వరసాగర్ బీజీఎమ్ మరీ గొప్పగా లేదు. ఉన్నంతలో సగటు చిరంజీవి సినిమా నుంచి ఆశించే హంగులు ఉంటాయనే హామీ మాత్రం ఈ టీజర్ తో భోళా శంకర్ ఇచ్చేశాడు
This post was last modified on June 24, 2023 6:47 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…