ఎంత పెద్ద డిజాస్టరైనా ఏదో ఒక రోజు చిన్నితెరకు రావాల్సిందే. ఒకప్పుడంటే శాటిలైట్ ఛానల్స్ మాత్రమే ఉండేవి కాబట్టి ఒకటి రెండు నెలలు ఆలస్యమైనా ఇబ్బంది లేదు. కానీ ఓటిటి జమానాలో అలా కుదరదు. బాక్సాఫీస్ వద్ద ఫెయిలయితే వీలైనంత త్వరగా డిజిటల్ వెర్షన్ వదిలేస్తే థియేటర్ మిస్ అయిన ఆడియన్స్ కనీసం ఫోన్ లో టీవీలో చూసుకునే అవకాశం దక్కుతుంది. దసరా, విరూపాక్ష, బలగం లాంటి బ్లాక్ బస్టర్లే నెల రోజుల ప్రీమియర్లు జరుపుకున్నప్పుడు ఏజెంట్ లాంటి సూపర్ ఫ్లాప్ ఎప్పుడో వచ్చి ఉండాలి. కానీ విచిత్రంగా వాయిదాలు పడుతూనే వస్తోంది.
వాస్తవానికి నిన్న ఎడిట్ చేసిన కొత్త వెర్షన్ తో ఏజెంట్ ఓటిటి రిలీజ్ ఉంటుందని కొద్దిరోజుల క్రితమే ప్రచారం జరిగింది. సరే వస్తుంది లెమ్మని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఏమైనా కొత్త సన్నివేశాలు లేదా ట్రిమ్ చేసిన వెర్షన్ బెటర్ గా ఉంటుందేమోనని వాళ్ళ నమ్మకం. కానీ రాలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి బృందం నిజంగానే రీ వర్క్ చేసిందా లేక ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనా అనే ప్రశ్నకు సమాధానం లేదు. నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టైన్మెంట్ బోళా శంకర్ ప్రమోషన్లలో బిజీ అయిపోయి ఏజెంట్ డిజిటల్ రిలీజ్ గురించి నామ మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు.
ఇంతకీ ఏజెంట్ వస్తుందా రాదా అనేది హక్కులు కొన్న సోనీ లివ్ అయినా చెబుతుందో లేదో మరి. ఇలాంటి పరాజయాలు ఏదో అఖిల్ ఒక్కడే చూసినట్టు ఆన్ లైన్ లో జరిగిన హంగామా దెబ్బకు ఇంత లేట్ అయ్యిందా లేక అసలు దీన్ని బయటికే తీసుకురాకుండా అలాగే సైడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా సదరు బృందానికే తెలియాలి. అఖిల్ తర్వాతి సినిమా ఇంకా ప్రకటించలేదు. యువి, ధర్మా ప్రొడక్షన్ల కలిసి సంయుక్తంగా నిర్మించబోయే ఫాంటసీ మూవీతో కొత్త దర్శకుడు అనిల్ ని పరిచయం చేసే ప్రణాళిక ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇంకొద్ది రోజుల్లో ప్రకటన రావొచ్చు.
This post was last modified on June 24, 2023 2:24 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…