ఆదిపురుష్ రెండో వారంలోకి అడుగుపెట్టిన టైంలోనూ దాని మీద వివాదాలు, నిరసనలు చల్లారడం లేదు. సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉన్నాయి. రచయిత మనోజ్ ఇస్తున్న ఇంటర్వ్యూలు, చేస్తున్న కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అవుతోంది. అయితే ప్రభాస్ నిర్ణయాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. ఎంతసేపున్నా దర్శకుడు ఓం రౌత్ మీదే విరుచుకుపడుతున్నారు. గుడ్డిగా నమ్మి సినిమా చేసినందుకు ఇలాంటి అవుట్ ఫుట్ ఇస్తావా అంటూ మూవీ లవర్స్ కోప్పడుతున్నారు. అయితే డార్లింగ్ అభిమానులు వీటికి కౌంటర్ల కోసం కొత్త రూటు పట్టుకున్నారు
ముప్పై ఏళ్ళ క్రితం టీవీ సీరియల్ గా వచ్చిన ప్రేక్షక లోకాన్ని ఊపేసిన దూరదర్శన్ రామాయణంని డౌన్లోడ్ చేసి మరీ అందులో తప్పులు వెతికే పనిలో పడ్డారు. అసలు టెక్నాలజీ కనీస స్థాయిలో లేని రోజుల్లోనే రామానంద సాగర్ దీన్నో అద్భుతంగా తీర్చిదిద్దారు. పరిమితుల వల్ల ఇందులోనూ లాజిక్ లేని సీన్లు, సిల్లీగా అనిపించే విజువల్ ఎఫెక్ట్స్ లేకపోలేదు. అయితే రామ సీత లక్ష్మణ రావణాసుర పాత్రలను ఏ కోణంలో వక్రీకరించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి కామెడీ టేకింగ్ తో ఆదిపురుష్ ని పోలుస్తారా అంటూ వీడియోలతో సహా పోలికలను బయటికి తెస్తున్నారు
ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి రామాయణంకు ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఈ పోలికే అసంబద్దమని టీవీ సిరీస్ తో ఆరు వందల కోట్ల ప్యాన్ ఇండియా మూవీని పోల్చడంలోనే మీ అమాయకత్వం తెలిసిపోతోంది రివర్స్ పంచులు వేస్తున్నారు. రామగాథ మీద లెక్కలేనన్ని సినిమాలు, సీరియల్స్, యానిమేషన్లు వచ్చాయి. వాటిలో తప్పుల తడకలు ఉన్నాయి. కానీ అవేవి ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ తో తీసినవి కావు. అందుకే జనం దృష్టిలో అన్నీ పడలేదు. కానీ ఆదిపురుష్ కి అది వర్తించదు. అందుకే ఇంత పెద్ద డిబేట్
This post was last modified on June 23, 2023 8:55 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……