సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రభాస్ అభిమానులు. ‘ఆదిపురుష్’తో అయినా కథ మారుతుందని ఆశిస్తే మళ్లీ నిరాశ తప్పలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానిది ఆరంభ శూరత్వమే అయింది. దీంతో ఇక వాళ్ల ఆశలన్నీ ‘సలార్’ మీదికి మళ్లాయి. ఈ చిత్రం విడుదలకు ఇంకో మూడు నెలలే సమయం ఉంది. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాలేదు. అందుకు ముహూర్తం కుదిరిందన్నది చిత్ర వర్గాల సమాచారం.
ఇంకో రెండు వారాల్లో.. అంటే జులై 7న ‘సలార్’ టీజర్ రిలీజ్ కాబోతోందట. ప్రశాంత్ నీల్ మార్కుతో.. ప్రభాస్‌ను ఒక రేంజిలో చూపించేలా ఈ టీజర్ రూపొందినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. టీజర్‌తో మొదలుపెట్టి.. రిలీజ్ లోపు ప్రమోషన్లను కూడా ఒక రేంజిలో ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ‘సలార్’ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రం ‘దళపతి’ తరహాలో ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే డ్రామా ఆధారంగా నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’తో కనెక్షన్ ఉంటుందని.. ప్రశాంత్ నీల్ మల్టీవర్స్‌ను ఈ సినిమాలో చూడబోతున్నామని చెబుతున్నారు. మరోవైపు ఇందులో కీలక పాత్ర చేస్తున్న తమిళ నటి శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేకెత్తించేవే.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ఈ సినిమా సాగుతుందని.. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశాడని.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటుందని.. ప్రభాస్ పాత్ర, పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని ఆమె చెప్పడం అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్ పాత్రలు పోషిస్తుండగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on June 23, 2023 10:26 am
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…