ఆదిపురుష్ ఊహించిన దానికన్నా తీవ్రంగా వీక్ డేస్ లో డ్రాప్ కావడంతో బయ్యర్ల ఆశలన్నీ కొత్త సినిమాల మీదే ఉన్నాయి ఒక రెండు మూడు వారాలు హౌస్ ఫుల్ బోర్డులు చూస్తామనే ఆశలపై దర్శకుడు ఓం రౌత్ నీళ్లు జల్లడంతో టికెట్ రేట్లు పెంచుకున్న ప్రయోజనం దక్కలేదు. మొదటి మూడు రోజులు రిలీజ్ కు ముందు వచ్చిన క్రేజ్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ పుణ్యమాని ఎక్కువ ఫిగర్లు వచ్చాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. సరే ఇలాంటివి ఎన్నో చూసిన బాక్సాఫీస్ కు ఇదేమీ కొత్త కాదు కానీ రేపు ఏకంగా తొమ్మిది రిలీజులున్నా హైప్ మాత్రం కనిపించడం లేదు.
ప్రముఖ నిర్మాత బిబిఎస్ ప్రసాద్ ‘కవిన్స్’ని అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ అయితే ఉంది కానీ ప్రేక్షకులకు మాత్రం ఇదొకటి వస్తుందన్న సంగతే రిజిస్టర్ కాలేదు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన ‘మను చరిత్ర’కు బజ్ లేకపోయినా ట్రైలర్ ఏదో డిఫరెంట్ గా అనిపించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మరో చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచ్’ ఏదైనా బలగం లాంటి టాక్ తెచ్చుకుంటే తప్ప కష్టమే. భారీ తారాగణం, కర్ణ, మా ఆవారా జిందగీ, కుట్ర-ది గేమ్ స్టార్ట్స్ నౌ, జాగ్రత్త బిడ్డ ఇలా లిస్టేమో పొడుగ్గా ఉంది కానీ బుకింగ్స్ మాత్రం లేవు
బాలీవుడ్ హారర్ మూవీ 1920 హరర్స్ అఫ్ ది హార్ట్, డిస్నీ యానిమేషన్ చిత్రం ఎలిమెంటల్స్ కూడా రేపే వస్తున్నాయి. మల్టీప్లెక్స్ జనాలకు తప్ప వీటి గురించి తెలిసిన బాపతు తక్కువే. ఇవన్నీ గమనిస్తే అటుఇటుగా ప్రభాస్ కే ఇంకో ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. నెగటివిటీని మర్చిపోయి ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చేయరు కానీ ఏదో ఒకటి థియేటర్లో చూడకపోతే టైం పాస్ కానివాళ్ళు ఆదిపురుష్ కు ఓటేసే ఛాన్స్ లేకపోలేదు. పైన చెప్పిన కొత్త రిలీజులన్నీ ఆషామాషీగా కాకుండా బ్రహ్మాండంగా ఉన్నాయనే టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం
This post was last modified on June 22, 2023 6:31 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…