పూజా హెగ్డే తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అనుష్క, కాజల్, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి ఒకప్పటి టాప్ హీరోయిన్ల ఊపు తగ్గాక.. పూజానే టాలీవుడ్లో హవా సాగిస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాక.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో టాలీవుడ్లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది.
పారితోషకం విషయంలో కూడా కొత్త శిఖరాలను అందుకుంది. స్టార్ హీరోయిన్ల కొరత అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇంకా కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో ఆమె హవా నడుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఆమె కెరీర్ తిరగబడిపోయింది. వరుస ఫ్లాపులు వస్తే ఎలాంటి హీరోయిన్‌కైనా కష్టమే అని.. అదే సమయంలో మెరుగైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తే సైడ్ అయిపోక తప్పదని పూజా విషయంలోనూ రుజువైంది.
పూజాకు వరుస ఫ్లాపులు వస్తున్న సమయంలోనే శ్రీలీల అనే కొత్తమ్మాయి రైజ్ అయింది. ‘పెళ్ళిసందడి’ లాంటి పేలవమైన సినిమా కూడా ఒక మాదిరిగా ఆడిందంటే అందుకు శ్రీలీల ఆకర్షణ ఓ ముఖ్య కారణం. ఇక రెండో సినిమా ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ కావడం.. అందం, అభినయం, డ్యాన్సింగ్ టాలెంట్.. ఇలా అన్నీ ఉండటంతో పెద్ద సినిమాల మేకర్స్ కళ్లు ఈ అమ్మాయిపై పడ్డాయి.
ఆల్రెడీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్‌తో నటిస్తోంది శ్రీలీల. నిజానికిది పూజా చేయాల్సిన సినిమానే. కానీ షూట్ ఆలస్యం అవుతుండటంతో పూజానే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాను ఎందుకు వదులుకున్నానా అని బాధ పడే పరిస్థితి. ‘ఉస్తాద్’లో పూజాను భర్తీ చేసిన శ్రీలీల.. ఇంకో సినిమాలోనూ ఆమెకు ఎసరు పెట్టిందంటున్నారు.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి రెండో హీరోయిన్‌గా ఎంపికైన శ్రీలీల.. ఇప్పుడు పూజా స్థానంలో లీడ్ హీరోయిన్ అయింది. ఇలా రెండు పెద్ద సినిమాల్లో పూజా స్థానాన్ని భర్తీ చేసిన శ్రీలీల.. ఇన్నాళ్లూ ఈ ముంబయి భామ చేతిలో ఉన్న నంబర్ వన్ కిరీటాన్ని కూడా లాగేసుకునేలా కనిపిస్తోంది. వరుస ఫ్లాపులు, చేజారుతున్న అవకాశాలతో టాలీవుడ్లో పూజా కెరీరే ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది.
This post was last modified on June 22, 2023 3:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…