రియా చక్రవర్తి నిజంగానే సుషాంత్ ఆత్మహత్యకు కారణమయిందో లేదో తెలియదు కానీ రోజు రోజుకీ ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కోర్టులు ఈ కేసులో ఎంత వేగంగా వున్నాయో, పోలీసులు ఎంత పరిశోధన్ చేస్తున్నారో తెలియదు కానీ మీడియా మాత్రం ప్రైవసీని తుంగలోకి తొక్కి మరీ పర్సనల్ విషయాలను న్యూస్‍లో పెట్టి చర్చాగోష్టి నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఎక్కడ తాము వెనకబడిపోతామోనని అన్ని న్యూస్ ఛానల్స్ ఈ కేసులో యమాసక్తి చూపించేస్తున్నాయి.
కొత్తగా మీడియా రియా ఫోన్ తీగను లాగగా… ఒక పెద్ద దర్శకుడి పేరు పలుమార్లు ఆమె ఫోన్ లిస్ట్లో ప్రత్యక్షమయింది. సుషాంత్ మరణానంతరం ఆమె ఫోన్ నుంచి ప్రముఖ దర్శక, నిర్మాత మహేష్ భట్ ఫోన్‍కి పదహారు కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. అలాగే మీడియాలో కొందరికి ఫోన్ చేసి తన గురించి పాజిటివ్ వార్తలు రాయాలని రియా కోరినట్టు సమాచారం. ఆమెకు పాజిటివ్ పిఆర్ కోసం ఒక దర్శకుడు మీడియాలో తెలిసిన వారికి సిఫార్సు చేసాడట.
మరి తన పట్ల సర్వత్రా నెగెటివిటీ స్ప్రెడ్ అవుతున్న కారణంగా మీడియాలో మంచిగా రాస్తే కొందరికి అయినా ద్వేషం తగ్గుతుందని అలా అడిగిందో లేక నిజంగానే ఏదైనా తప్పు చేసి దాస్తోందో కానీ ఏదేమైనా సుషాంత్ తన ప్రాణం తీసుకోవడంతో పాటు రియా కెరియర్‍కి కూడా చరమగీతం పాడినట్టయింది.
This post was last modified on August 12, 2020 2:23 am
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…
జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…