ఆదిపురుష్ ఫలితం ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకున్న ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సలార్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో తొంభై తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ నిన్నటి నుంచి వంద రోజుల కౌంట్ డౌన్ పోస్టర్ వదిలి ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 28 నుంచి వెనక్కు తగ్గే సూచనలు లేవని పక్కా క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న విశాల్ పొగరు విలన్ శ్రియా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మాములు వైరల్ కావడం లేదు.
సలార్ మీ ఊహలకు అందని విధంగా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించిన ప్రపంచం రెండున్నర గంటల పాటు ఇంకో లోకంలో విహరింపజేస్తుందని ఒకటే ఊరిస్తూ చెప్పడం డార్లింగ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. చాలా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేశానని, ప్రభాస్ తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి ఏడెనిమిది పాత్రలు నాన్ స్టాప్ యాక్షన్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తాయట. ఏ రేంజ్ లో అంటే ఏకంగా గేమ్ అఫ్ థ్రోన్స్ తో పోల్చడం విన్నాక ఇంతకన్నా ఏం ఎలివేషన్ ఉంటుందనిపించడం ఖాయం. కెజిఎఫ్ ని మించి అనే హింట్ అయితే స్పష్టంగా ఇచ్చారు
వచ్చే నెల మొదటి వారం నుంచి సలార్ ప్రమోషన్లు ఊపందుకోబోతున్నాయి. ఆగస్ట్ నుంచి స్పీడ్ పెంచబోతున్నారు. టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆదిపురుష్ ప్రభావం దీని మీద ఎంత మాత్రం పడేలా లేదు. దాని ఫెయిల్యూర్ కి అందరూ దర్శకుడు ఓం రౌత్ ని నిందిస్తున్నారు తప్ప ప్రభాస్ ని కాదు. ఇదంతా ముందే ఊహించాడు కాబోలు వ్యక్తిగత కారణాల మీద విదేశాలకు వెళ్ళిపోయిన డార్లింగ్ తిరిగి రాగానే ప్రాజెక్ట్ కె, మారుతీ సినిమాలతో బిజీ అవుతాడు. సలార్ డబ్బింగ్ కూడా వచ్చే నెలాఖరులోపు పూర్తి చేసేలా అంతా సిద్ధం చేశారట
This post was last modified on June 21, 2023 7:07 pm
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…