సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. మొన్నటి వరకూ ఈ సినిమా అప్ డేట్స్ కోసం షూటింగ్ షెడ్యూల్స్ న్యూస్ కోసం వెయిట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ కి రోజుకో అవుట్ న్యూస్ బాధ పెడుతుంది. ముందుగా సినిమా నుండి తమన్ అవుట్ అనే న్యూస్ బయటికొచ్చింది. ఆ తర్వాత మేకర్స్ అదేం లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్తూ షూటింగ్ డీటైల్స్ బయటికి వదిలారు.
తమన్ న్యూస్ అవ్వగానే సినిమా నుండి పూజ హెగ్డే అవుట్ అంటూ మరో న్యూస్ వచ్చింది. దీనిపై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ పూజా హెగ్డే సినిమాలో నటించడం లేదని ఇకపై షూటింగ్ లో పాల్గొనదని పక్కాగా తెలుస్తుంది. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే తో పాటు శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూజ ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఫైనల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్.
మహేష్ కి జోడీగా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లాను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఫరియా తర్వాత నిధి అగర్వాల్ వంటి హీరోయిన్స్ ను కూడా ఛాయిస్ గా పెట్టుకుంటున్నారని సమాచారం. త్వరలోనే పూజ సినిమాలో నటించడం లేదని చెప్తూ మేకర్స్ మరో హీరోయిన్ కి వెల్కం చెప్పే అవకాశం ఉంది.
This post was last modified on June 21, 2023 3:28 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…