కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. థియేటర్స్ లో ఉండగానే ఓటీటీ రిలీజ్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ సినిమాను చూశారంటే బలగం గొప్పదనం తెలుస్తుంది. చాలా కాలం తర్వాత అందరూ కలిసి వీధుల్లో చూసిన సినిమాగా బలగం హాట్ టాపిక్ అయింది. రిలీజ్ నుండే మీడియా , సినీ ప్రముఖులు అంతా కలిసి సినిమాను మెచ్చుకుంటూ ప్రమోట్ చేశారు. రిలీజైన కొన్ని రోజులు మోస్తారు రన్ తో నడిచిన ఈ సినిమా వారం అయ్యాక జనాల్లోకి వెళ్ళింది. అక్కడి నుండి ఓటీటీ లోకి వచ్చే వరకూ థియేటర్స్ లో కుటుంబాలను భారీ రప్పించింది. విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కలిపింది.
అయితే మొదటి సినిమానే ఇంత గొప్పగా తీసి అందరినీ ఎమోషనల్ కి గురి చేసిన వేణును అందరూ అభినందించారు. హీరోల నుండి దర్శకుల వరకూ అందరూ మెచ్చుకుంటూ సన్మానాలు చేశారు. కానీ ఇలాంటి విషయాల్లో ముందుండే హీరో నాని మాత్రం ఆలస్యంగా బలగం చూసి ట్వీట్ చేశాడు. నిజానికి ఏ చిన్న సినిమా బాగున్నా నాని నుండి అభినందనలతో ఓ ట్వీట్ ఉంటుంది. కానీ బలగం విషయంలో చాలా ఆలస్యం చేశాడు నాని. ఇంత ఆలస్యంగా చూశానని నమ్మలేకపోతున్నా, తెలుగు సినిమా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమాగా బలగం చెప్పవచ్చు అంటూ టీం ను అభినందించాడు.
నేచురల్ స్టార్ బలగం ఇంత లేట్ గా చూడటం , అందరూ చెప్పేశాక ఇప్పుడు ట్వీట్ చేయడంతో టూ లేట్ నాని అంటే నెటిజన్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు. సినిమా ఆడుతున్నప్పుడు ఇలాంటి ట్వీట్స్ సినిమాకు హెల్ప్ అవుతాయి కానీ ఇంత లేట్ గా చెప్తే ఏం ప్రయోజనం. పైగా సినిమాను జనం మెచ్చేసుకొని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఏదేమైనా నాని ఈసారి ఓ చిన్న సినిమాను అభినందించడంలో చాలా ఆలస్యం చేశాడు మరి.
This post was last modified on June 21, 2023 12:24 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…