వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే వర్మ మాత్రం అదేం లేదంటున్నాడు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియాలో వార్తలొస్తే .. అదంతా అబద్ధం అంటూ తాను ఎంత ఫిట్‌గా ఉన్నది చూపిస్తూ డంబుల్స్ ఎత్తి బైసెప్స్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను ఇటీవలే షేర్ చేశాడు వర్మ.. దీంతో వర్మ గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదని అంతా అనుకున్నారు.
కానీ వర్మ నిర్మాణంలో తెరకెక్కి మర్డర్ సినిమా విడుదల ఆపాలంటూ మిర్యాలగూడకు చెందిన అమృత వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత తరఫు న్యాయవాది నల్గొండ జిల్లా కోర్టుకు ఇచ్చిన వివరణ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు.
తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మ కు కరొనా వచ్చిన నేపథ్యంలో కోర్టు నోటీసులకు జవాబు ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెలకు 14 వాయిదా వేసింది కోర్టు.. వర్మకు కరోనా ఉందని ఆయన న్యాయవాది కోర్టుకు చెప్పారు అంటే.. ఇక అంతకంటే రుజువేం కావాలి. అయినా సరే వర్మ మాత్రం తనకు కరోనా లేదనే అంటున్నాడు. సదరు వార్తను ఫేక్ న్యూస్‌గా పేర్కొంటూ ఒక ట్వీట్ చేశాడు. తాను నిర్మించిన థ్రిల్లర్ సినిమా కథానాయిక అప్సరా రాణితో కలిసి తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. ఐతే వర్మ తీరేంటో జనాలకు తెలిసిందే కాబట్టి ఆయనకు కరోనా ఉందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారంతా.
This post was last modified on August 11, 2020 11:09 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…