వర్మకి కరోనా అంటున్న లాయర్! కాదంటున్న వర్మ!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు క‌రోనా సోకిన‌ట్లుగా కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఐతే వ‌ర్మ మాత్రం అదేం లేదంటున్నాడు. ఆయ‌న తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు మీడియాలో వార్త‌లొస్తే .. అదంతా అబద్ధం అంటూ తాను ఎంత ఫిట్‌గా ఉన్నది చూపిస్తూ డంబుల్స్ ఎత్తి బైసెప్స్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను ఇటీవ‌లే షేర్ చేశాడు వ‌ర్మ.. దీంతో వ‌ర్మ గురించి జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌ని అంతా అనుకున్నారు.

కానీ వ‌ర్మ నిర్మాణంలో తెర‌కెక్కి మర్డర్ సినిమా విడుదల ఆపాలంటూ మిర్యాల‌గూడ‌కు చెందిన అమృత వేసిన పిటిషన్ విచారణ సంద‌ర్భంగా ఆ చిత్ర నిర్మాత త‌రఫు న్యాయవాది న‌ల్గొండ జిల్లా కోర్టుకు ఇచ్చిన వివ‌ర‌ణ చూసి అంతా ఆశ్చర్య‌పోతున్నారిప్పుడు.

తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మ కు కరొనా వచ్చిన నేపథ్యంలో కోర్టు నోటీసుల‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు ఆయ‌న‌ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఈ కేసు విచార‌ణ‌ను ఈ నెలకు 14 వాయిదా వేసింది కోర్టు.. వ‌ర్మ‌కు క‌రోనా ఉంద‌ని ఆయ‌న న్యాయ‌వాది కోర్టుకు చెప్పారు అంటే.. ఇక అంత‌కంటే రుజువేం కావాలి. అయినా స‌రే వ‌ర్మ మాత్రం త‌న‌కు క‌రోనా లేద‌నే అంటున్నాడు. స‌ద‌రు వార్త‌ను ఫేక్ న్యూస్‌గా పేర్కొంటూ ఒక ట్వీట్ చేశాడు. తాను నిర్మించిన‌ థ్రిల్ల‌ర్ సినిమా క‌థానాయిక అప్స‌రా రాణితో క‌లిసి తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఐతే వ‌ర్మ తీరేంటో జ‌నాల‌కు తెలిసిందే కాబ‌ట్టి ఆయ‌నకు క‌రోనా ఉంద‌నే అభిప్రాయానికి వ‌చ్చేస్తున్నారంతా.