మెగా ఫ్యామిలీకి శంకర్ పేరు బాగా కలిసి వస్తోంది కాబోలు. టైటిల్స్ అదే పనిగా కుదురుతున్నాయో లేక కాకతాళీయంగా జరుగుతున్నాయో మొత్తానికి రిపీట్ లైతే పడుతున్నాయి. చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. తర్వాత శంకర్ దాదా జిందాబాద్ ఆడలేదు. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ గా వస్తే కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకోలేదు కానీ అభిమానులకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఇదీ ఒకటి. అందుకే సెప్టెంబర్ లో పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా కొత్తగా రీ మాస్టర్ చేసి మళ్ళీ విడుదల చేయబోతున్నారు.
ఆగస్ట్ లో చిరు భోళా శంకర్ గా రాబోతున్నారు. వేదాళం రీమేక్ అయినప్పటికీ దీని మీద ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వంతు వచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందబోయే మాస్ ఎంటర్ టైనర్ కి గాంజా శంకర్ గా టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. రిజిస్టర్ కూడా చేశారట. దీనికి సంబంధించిన హింట్ విరూపాక్ష టైంలో పరస్పరం ఇచ్చుకోవడం సోషల్ మీడియాలో చూశాం. ఫైనల్ గా ఇప్పుడది కార్యరూపం దాల్చబోతోంది. సీటీ మార్ తర్వాత గ్యాప్ తీసుకున్న సంపత్ నందికి ఇప్పుడీ సక్సెస్ చాలా కీలకం.
ప్రస్తుతం హీరోయిన్ ని లాక్ చేసే పనిలో ఉన్నారు. శ్రీలీలను ట్రై చేస్తున్నప్పటికీ డేట్లు దొరకడం కష్టంగా ఉండటంతో పూజా హెగ్డే పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. యాక్సిడెంట్ జరిగి రిపబ్లిక్ తో ఫ్లాప్, విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ సుప్రీమ్ లాంటి మాస్ మూవీ చేయాలని ఎదురు చూస్తున్నాడు. రామ్ చరణ్ కు రచ్చ లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి ఆ నమ్మకంతోనే ఓకే చెప్పినట్టు కనిపిస్తోంది. గాంజా శంకర్ అంటేనే ఊర మాస్ ముద్ర కనిపిస్తోంది. మరి ఇన్నేళ్ల తర్వాత సాయి తేజ్ ఇలాంటి క్యారెక్టర్ లో ఎలా కనిపించనున్నాడో
This post was last modified on %s = human-readable time difference 5:46 pm
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…