Movie News

‘ఆదిపురుష్’ను బ్యాన్ చేయాలని సినిమా వాళ్లే..

‘ఆదిపురుష్’ సినిమాకు అసలే టైం బాగా లేదు. విపరీతమైన డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం.. వీకెండ్ వరకు బలంగానే నిలబడ్డా.. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర డల్లయిపోయింది. డివైడ్ టాక్ బాగా పని చేసి.. సినిమాకు వసూళ్లు పడిపోయాయి. మళ్లీ వీకెండ్ వస్తే తప్ప సినిమా పుంజుకునేలా లేదు. అసలే పరిస్థితి బాలేదంటే.. ఈ చిత్రానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ‘ఆదిపురుష్’ను నిషేధించాలంటూ సినిమా వాళ్లే డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. 

ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. రామాయణ గాథను కించపరిచేలా ‘ఆదిపురుష్’ తీశారంటూ ఈ సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఈ సంఘం డిమాండ్ చేసింది. ‘శ్రీరామ చంద్రుడిని మతాలతో సంబంధం లేకుండా అందరూ దేవుడిగా నమ్ముతారు. కొలుస్తారు. కానీ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడితో పాటు రావణుడిని వీడియో గేమ్ కార్టూన్ల మాదిరి చిత్రీకరించారు.

ఇందులోని డైలాగులు భారతీయులనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఈ సినిమా మీద నిషేధం విధించేలా చర్యలు చేపట్టాలి. థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత అవమానకంగా తీసిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో నటించాల్సింది కాదు. రామాయణాన్ని, రాముడిని కించపరిచేలా ఈ సినిమా తీశారు. వెంటనే దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషిర్, నిర్మాతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి’’ అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

This post was last modified on June 20, 2023 4:02 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago