టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు ఎవరికి వారే అన్నట్లే ఉంటారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు పలకరించడం, విషెస్ చెప్పడం లాంటివి తక్కువే. ఇలాంటి సమయంలో మొన్న తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం, కొంతమంది సెలబ్రెటీలను ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఉన్నాడు. ఐతే విజయ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు.
పైగా మన మహేష్ ఛాలెంజ్‌ను అతనేం పట్టించుకుంటాడులే అని అంతా అనుకున్నారు. కానీ అతను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు. మహేష్‌ను సార్ అని సంబోధిస్తూ ఇది మీకోసం చేశా అంటూ ఫొటోలు పెట్టాడు. విజయ్ ట్విట్టర్లో ఎప్పుడో కానీ ట్వీట్ వేయడు. చివరగా ఫిబ్రవరిలో తన కొత్త సినిమా మాస్టర్ గురించి ఒక అప్ డేట్ ఇచ్చాడు. అలాంటిది మహేష్ మాటకు విలువ ఇచ్చి ఇలా మొక్కలు నాటి ఫొటోలు షేర్ చేయడం అతడి అభిమానులకు కూడా ఆశ్చర్యం కలిగించింది.
తన ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు విజయ్‌కి కృతజ్ఞతలు చెప్పిన మహేష్.. కరోనా టైంలో క్షేమంగా ఉండాలంటూ ట్వీట్ వేశాడు. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లయిన ఒక్కడు, పోకిరి సినిమాల రీమేక్‌ల్లో నటించిన విజయ్ భారీ విజయాలందుకున్నాడు. అప్పట్నుంచి వీరి మధ్య మంచి అనుబంధం సాగుతోంది. వీళ్లిద్దరి కలయికలో ఓ మల్టీస్టారర్ తీయాలని స్పైడర్ టైంలో దర్శకుడు మురుగదాస్ ఆలోచన చేశాడు. భవిష్యత్తులో ఏమైనా అది కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.
This post was last modified on August 11, 2020 8:06 pm
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…