ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూడు రోజుల్లో మూడు వందల కోట్లు దాటేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ తో మేకర్స్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తొలి వీకెండ్ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 340 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తూ పోస్టర్ విడుదల చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన మూడు రోజుల వసూళ్లను , మహేష్ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తూ ప్రభాస్ అభిమానులను గిల్లడం మొదలుపెట్టారు.
నాలుగో రోజు సర్కారు వారి పాట మార్నింగ్ షో కలెక్షన్స్ , మ్యాట్నీ వసూళ్లు థియేటర్స్ , ఏరియా వైస్ బయటికి తీస్తూ పాన్ ఇండియా మూవీ కాకుండా డైరెక్ట్ తెలుగు తెలుగు సినిమాతో నాన్ రాజమౌళితో మహేష్ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టాడని పోస్టులు చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. దీంతో ‘ఆదిపురుష్’ దెబ్బకి సర్కారు వారి పాట ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.
ఏదేమైనా ఓ స్టార్ సినిమా వచ్చినప్పుడు, మరో స్టార్ ఫ్యాన్స్ ఇలా వార్ కి దిగడం , కలెక్షన్స్ తో ఒకరికొకరు గిల్లుకోవడం సహజమే. ఇదంతా తమ అభిమాన హీరో గొప్ప చెప్పుకోవడం కిందకి వస్తుంది. వారికి వీరు కౌంటర్ వేయడం , వాళ్ళు రీ కౌంటర్ ఇవ్వడం సర్వ సాధారణం. ఇలా కొన్ని గంటలు కలెక్షన్స్ తో ఫ్యాన్స్ కబడ్డీ ఆడుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు.
This post was last modified on June 20, 2023 6:55 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…