ఆదిపురుష్ మీద జరుగుతున్న రచ్చ, చర్చ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ రామాయణంలోని పాత్రనే ఆధారంగా చేసుకున్న హనుమాన్ మీద దృష్టి పెరగడం మొదలైంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా కూడా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఆధారపడి నిర్మాణం జరుపుకుంది. త్రీడి వెర్షన్ కూడా సిద్ధం చేయబోతున్నారు. అయితే ప్రభాస్ మూవీనే ఇన్ని విమర్శలకు గురైనప్పుడు తేజ లాంటి చిన్న హీరోతో ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన చిత్రాన్ని ట్రోలర్స్ వదిలిపెడతారానే సందేహం రావడం సహజం.
కానీ హనుమాన్ కి అలాంటి భయమేమీ లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్తమానంలో నడిచే సూపర్ హీరో కథ. అంతర్భాగంలో హనుమాన్ పాత్ర ఒక స్ఫూర్తిగా ఉంటుందే తప్ప కథనం పూర్తిగా ఫాంటసీ టచ్ తో సాగుతుంది. భజరంగి గొప్పదనం వివరించేలా ఇప్పటి తరం తమ శక్తి సామర్ధ్యాలు తాము తెలుసుకునేలా ఏం చేయాలనే పాయింట్ తో రూపొందిస్తున్నారు. నిజానికి మే లేదా జూన్ లో రిలీజ్ ప్లాన్ చేయాలనుకున్నారు కానీ గ్రాఫిక్స్ తాలూకు పనులు పెండింగ్ లో ఉండటంతో పాటు ఆదిపురుష్ అయ్యాకే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆగడం ప్లస్ అవుతోంది
నిజానికి ఈ పరిణామాలూ మంచికే అనుకోవాలి. హనుమాన్ కనక మెప్పించేలా ఉంటే నార్త్ ఆడియన్స్ నెత్తిన బెట్టుకుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆదిపురుష్ ని ఒక్కసారైనా థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళ నిర్ణయమే మూడు వందల కోట్ల వసూళ్లను దాటించింది. అలాంటిది హనుమాన్ ఎలివేషన్ ని కొత్త జనరేషన్ కోసం ప్లాన్ చేసుకున్న ప్రశాంత్ వర్మని స్వాగతించకుండా ఉంటారా. బడ్జెట్ చాలా ఎక్కువ అయినప్పటికీ నిర్మాతలు మాత్రం అవుట్ ఫుట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ వచ్చాక లెక్కలు రేట్లు మారిపోతాయనే ధీమాలో ఉన్నారు. చూద్దాం
This post was last modified on June 19, 2023 8:18 pm
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…