టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ల కాంబినేషన్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. మరోవైపు, రామాయణ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, మరికొందరైతే… ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక, సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ అభిమానులు…చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై సోషల్ మీడియాలో కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లు వసూలు చేసిందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం విడుదలైన తర్వాత దర్శకుడు ఓం రౌత్ తొలిసారిగా స్పందించారు. ఆది పురుష్ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో హనుమంతుడి కోసం వదిలిపెట్టిన సీట్ల ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ మొదలుపెట్టిన ఓం రౌత్…దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని అన్నారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై మాత్రం ఆయన స్పందించకపోవడం విశేషం.
This post was last modified on June 18, 2023 12:16 am
టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…