ప్రభాస్ ఒక్కడికే సాధ్యమయ్యింది

నిన్న విడుదలైన ఆదిపురుష్ టాకులు ఫలితాలు కాసేపు పక్కనపెడితే ప్రభాస్ రియల్ స్టామినా ఏంటో మరోసారి బయట పడింది. తన ప్యాన్ ఇండియా ఇమేజ్ ఏ స్థాయిలో మేజిక్ చేయగలదో ఋజువు చేసింది. ఒకటి రెండు కాదు మొదటి రోజు ఏకంగా మూడు సినిమాలతో ఫస్ట్ డే హండ్రెడ్ క్రోర్ గ్రాసర్స్ సాధించడం సంచలన రికార్డు. గతంలో బాహుబలి 2, సాహోతో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్ రాధే శ్యామ్ తో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అది ప్రేమకథ కాకుండా ఏదైనా ఫాంటసీ లేదా విజువల్ ఎఫెక్ట్స్ జానర్ అయ్యుంటే ఇంకో మైలురాయి సులభంగా తోడయ్యేది

ఎలా చూసుకున్నా వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ మాత్రం కొనసాగుతోంది. ఆదిపురుష్ సుమారు 138 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఫిగర్స్ ని నమోదు చేసింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ లెక్కలు రాకపోవడంతో ప్రస్తుతానికి ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు ఇవి చెలామణిలోకి వచ్చాయి. వంద కోట్ల మార్క్ చేరుకోవడం మీద తొలుత కొన్ని అనుమానాలు వచ్చాయి. కానీ మార్నింగ్ షో రెస్పాన్స్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లను నింపేయడంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం పడలేదు

దీన్ని బట్టే ప్రభాస్ ప్యాన్ ఇండియా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇవాళ రేపు వీకెండ్ కాబట్టి కలెక్షన్ల పరంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. పైగా ఏ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సండే సెకండ్ షో వరకు ఫుల్ అయిపోయాయి. ఒకవేళ సోమవారం నుంచి కూడా స్టడీగా ఉంటే బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు. అది తేలాలంటే ఇంకో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే. హిందీ వెర్షన్ తోనూ 40 కోట్లకు దగ్గరగా వెళ్లిన ప్రభాస్ బాలీవుడ్ ఖాన్ల ద్వయానికి రాబోయే రోజుల్లో భారీ సవాళ్లు విసరడం ఖాయమే .