జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ క్రేజీ మల్టీ స్టారర్ కాంబినేషన్ లో రూపొందబోయే వార్ 2 లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైనట్టుగా వచ్చిన వార్త బాగా తిరుగుతోంది. అయితే ఇద్దరు హీరోల్లో తను ఎవరి పక్కన జోడిగా ఆడిపాడుతుందనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో హృతిక్ కి భిన్నంగా తారక్ పాత్రకు కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఒకే మిషన్ మీద వ్యతిరేక దిశలో పని చేస్తున్న ఈ ఇద్దరూ ఆఖరికి దేశం కోసం ఒక్కటై చేతులు కలిపి దేశద్రోహుల అంతు చూడటమనే మెయిన్ పాయింట్ తో రూపొందిస్తారట.
దర్శకుడు అయాన్ ముఖర్జీ అతి త్వరలో స్క్రిప్ట్ ఫైనల్ చేసి నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ తో ఓకే చేయించుకున్నాక హీరోలను కలవబోతున్నాడు. అయితే కియారాని ఎవరి పక్కన పెట్టాలనేది ఇంకా డిసైడ్ చేయలేదని వినికిడి. స్క్రీన్ స్పేస్ పరంగా హృతిక్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి తనకే ఉండొచ్చని మరో న్యూస్. ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చే జూనియర్ ఎంట్రీతో సినిమా టోనే మారిపోతుందని, కమర్షియల్ ఫార్ములాతో రెగ్యులర్ హీరోయిన్ ట్రాక్, డ్యూయెట్లు లాంటివి లేకుండా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని యూనిట్ వర్గాల సమాచారం.
సో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ దాన్ని నవంబర్ లేదా అంతకన్నా ముందు అక్టోబర్ లోనే పూర్తి చేసేలా దర్శకుడు కొరటాల శివతో ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నాలుగు నెలలు కేటాయించి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా నిర్ణయించుకున్నారట. దానికి అనుగుణంగానే వార్ 2కి కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోగా సలార్ రిలీజై ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి వెంటనే ఎన్టీఆర్ 32 మొదలుపెట్టేయొచ్చు. అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే వార్ 2 మీద హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది
This post was last modified on June 17, 2023 11:26 am
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…