కరోనా ఎన్నో కోట్ల మంది జీవితాల్ని అతలాకుతలం చేసింది. వాళ్లు ఉపాధిని పోగొట్టింది. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఏ లోటూ లేకుండా బతికిన వాళ్లు కూడా ఇప్పుడు నెలల తరబడి ఆదాయం లేక తమ స్థాయికి తగని పనుల వైపు మళ్లుతున్నారు. కరోనా వల్ల కుదేలైన రంగాల్లో సినిమా ఫీల్డ్ కూడా ఒకటి.
అందులోని కార్మికులకు ఆరు నెలలుగా ఉపాధి లేదు. సినీ పరిశ్రమ నుంచి అందే సాయంతో కడుపు నిండినా మిగతా అవసరాల మాటేంటి? ఇలా ఎన్ని నెలలు ఆ సాయం మీదే ఆధారపడి బతకడం. పైగా అందరికీ కూడా సాయం అందకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం వేరే మార్గాల వైపు చూస్తున్నారు.
కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా ఎంతో కొంత పెట్టుబడి కావాలి. అది అందించే వాళ్లు దేవుళ్లే ఇప్పుడు. బాలీవుడ్లో వంద మంది డ్యాన్సర్లకు ఇప్పుడు కత్రినా కైఫ్ దేవతలాగే కనిపిస్తోంది. కరోనా వల్ల విపత్కర పరిస్థితుల్లో ఉన్న వంద మంది డ్యాన్సర్లకు కత్రినా ఆర్థిక సాయం చేసింది. వాళ్లు కూరగాయల దుకాణాలు పెట్టుకోవడానికి డబ్బులిచ్చింది.
ఇంతకుముందు హృతిక్ రోషన్ సైతం ఇలా వంద మంది డ్యాన్సర్లకు సాయం చేశాడు. అతడి స్ఫూర్తితోనే కత్రినా కూడా తన వంతు సాయం ప్రకటించింది. ఈ డబ్బులు అందుకున్న డ్యాన్సర్లు కూరగాయలకు ఇప్పుడున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని చిన్న స్థాయిలో వ్యాపారం పెట్టుకున్నారు. దీంతో వారి కుటుంబాలకు తాత్కాలికంగా కష్టాలు తీరిపోయాయి. సినిమాల్లో మళ్లీ పనులు దొరికే వరకు ఇబ్బంది లేనట్లే.
This post was last modified on August 11, 2020 11:46 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…