అదేంటి విడ్డూరంగా విమానం సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకనుకుంటున్నారా. అసలు మతలబు వేరే ఉంది. రేపు విడుదల కాబోతున్న ఆదిపురుష్ కోసం హైదరాబాద్ లో ఉన్న థియేటర్లు తొంభై శాతంకు పైగా ప్రభాస్ మూవీకే ఇచ్చారు. అందులో అభిమానులు చాలా కీలకంగా భావించేవి ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సింగల్ స్క్రీన్లు. తెల్లవారుఝామున బెనిఫిట్ షోలతో సహా అక్కడ ఉన్నవన్నీ ఆదిపురుష్ వేసుకుంటున్నాయి. కానీ కీలకమైన సంధ్య 70 ఎంఎంలో మాత్రం విమానంనే కొనసాగించడం అసలు ట్విస్టు. టాక్ సంగతి ఎలా ఉన్నా కమర్షియల్ ఫెయిల్యూర్ ఇది
క్వాలిటీ స్క్రీన్, పెద్ద కెపాసిటీ ఉన్న సంధ్యలో విమానం కొనసాగించడం వల్ల క్రాస్ రోడ్స్ కు సంబంధించిన ఆదిపురుష్ ఓవరాల్ గ్రాస్ లో భారీ కోత పడుతుందని ఫీలవుతున్నారు. నిజానికి విమానంకు కనీస ఆక్యుపెన్సీ రావడం లేదు. షోకి అయిదు వేలు దాటడమే గగనమైపోయింది. అయినా సరే మొదటి వారం ఏదోలా నెట్టుకొచ్చారు. సెకండ్ వీక్ కంటిన్యూ చేసేంత సీన్ లేదు. అయినా ఆడిస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్ కు అడ్వాన్స్ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చి ఉంటాయి. లేదంటే ఇలా జరగదు. ఆదిపురుష్ పంపిణి చేస్తున్న మైత్రి గట్టిగానే ట్రై చేస్తోందట
నాలుగైదు షోలు వేస్తే సంధ్య 70 ఎంఎంలో పది లక్షలకు పైనే గ్రాస్ వస్తుంది. అలాంటిది మూడు నాలుగు వేలు తెచ్చే విమానంని ఆడించి లాభం లేదు. క్రాస్ రోడ్స్ లో ఆర్ఆర్ఆర్ రికార్డుల మీద కన్నేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా మైత్రిని, పీపుల్స్ మీడియాని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది. ఇప్పటికిప్పుడు సంధ్యలో ఆదిపురుష్ వేస్తే నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ అవుతాయి. కనీసం ఆదివారం వరకు హౌస్ ఫుల్ బోర్డు తీయాల్సిన పని ఉండదు. కానీ విమానం కదిలించే సూచనలైతే తక్కువగా ఉన్నాయి
This post was last modified on June 15, 2023 9:40 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…