2024 సంక్రాంతికి ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉండగానే ఆ సీజన్లో వచ్చే సినిమాల మీద ఉత్కంఠ నెలకొంది. ఆ పండక్కి షెడ్యూల్ అయిన ‘ప్రాజెక్ట్-కే’ రేసు నుంచి తప్పుకున్నట్లు దాదాపుగా తేలిపోవడంతో మొత్తం లెక్కలు మారిపోతున్నాయి. దీనికి పోటీగా ఆల్రెడీ షెడ్యూల్ అయిన ‘గుంటూరు కారం’కి సంబంధించి చిత్రీకరణలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ.. ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ పండక్కే రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
కాగా తాజాగా మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘ఈగల్’ 2024 సంక్రాంతికి రిలీజ్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతానికి రెండు సినిమాలు మాత్రమే పండక్కి వస్తున్నట్లు. కానీ ఆ టైంలో ఇంకో పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి కూడా అవకాశముంటుందని భావిస్తున్నారు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంతకుముందు అయితే పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో ఉంటాడనే ప్రచారం జరిగింది. ఆయన గత రెండు మూడు నెలలుగా మార్చి మార్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చాడు. వీటిలో వీలును బట్టి ఏదో ఒక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇటు ‘ఉస్తాద్..’ దర్శకుడు హరీష్ శంకర్, అటు ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య ఇద్దరూ కూడా వేర్వేరు సందర్భాల్లో తమ చిత్రాలను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
కానీ ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో తన సినిమాల షూటింగ్‌లన్నీ ఆపేసిన పవన్.. పూర్తిగా రాజకీయాలకు టైం కేటాయించాలని ఫిక్సయ్యాడు. దీంతో ఉస్తాద్, ఓజీ.. ఈ రెండింట్లో ఏదీ సంక్రాంతికి రాదని తేలిపోయింది. కాగా ఇప్పుడు చిరంజీవి సంక్రాంతి రేసులోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెడుతున్నారు. ఆ సినిమాను వేగంగా పూర్తి చేసి 2024 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. మరి వరుసగా రెండో ఏడాది సంక్రాంతికి చిరు హంగామా ఉంటుందేమో చూడాలి.
This post was last modified on June 15, 2023 4:16 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…