నిర్మాణ దశలోనే విపరీతమైన హైప్ మోసుకొస్తున్న ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్ భాగం కావడం ఫిక్సయ్యింది. టీమ్ అఫీషియల్ గా చెప్పకపోయినా లీకైన సోర్స్ నమ్మదగినది కావడంతో పది రోజుల క్రితమే ఈ న్యూస్ వైరల్ కావడం తెలిసిందే. ఆగస్ట్ లో మొదలయ్యే షెడ్యూల్ నుంచి ముప్పై రోజుల కాల్ షీట్స్ కోసం లోకనాయకుడికి అక్షరాలా వంద కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ టాక్. నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన క్యారెక్టర్ కావడంతో ఆయన తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరని దర్శకుడు నాగ అశ్విన్ భావించడం వల్లే ఇంత రెమ్యునరేషన్ కి సిద్ధపడ్డారట.
దీని వెనుక తెలివైన ఎత్తుగడ ఉంది. బాహుబలి తప్ప తమిళనాడులో అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన తెలుగు డబ్బింగులు తక్కువ. ఆర్ఆర్ఆర్ ఆడింది కానీ నెంబర్ వన్ కాలేకపోయింది. ప్రాజెక్ట్ కెలో ఇప్పుడు కమల్ తోడయ్యారు కాబట్టి ఆ బ్రాండ్ మీద నాలుగింతలు ఎక్కువ బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాని వల్ల ఇప్పుడిస్తున్న పెద్ద మొత్తం వైజయంతి సంస్థకు ఈజీగా రికవర్ అయిపోతుంది. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అనుపమ్ ఖేర్ లు ఉన్నారు కాబట్టి నార్త్ మార్కెట్, థియేటర్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.
వీటన్నింటికి ప్రభాస్ మాచో ఇమేజ్ ఎలాగూ తోడవుతుంది. 2024 జనవరి 12 విడుదల టార్గెట్ చేసుకున్న ప్రాజెక్ట్ కె ఆ తేదీకి రావడం పట్ల అనుమానాలైతే ఉన్నాయి. ఇంకా షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పాటలు పూర్తి చేయాలి. ప్రమోషన్లకు ఒక రెండు నెలలు కావాలి. అందుకే డౌట్ ఉన్న మాట వాస్తవం. ఈ కారణంగానే రవితేజ ఈగల్ తో పాటు చిరంజీవి కళ్యాణ్ కృష కాంబోలో మొదలవ్వాల్సిన సినిమా కూడా సంక్రాంతే అంటున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా కమల్ ప్రభాస్ ల మెంటల్ మాస్ కాంబినేషన్ తెరమీద సృష్టించబోయే విధ్వంసం మాటలకందటం కష్టమే
This post was last modified on June 15, 2023 2:27 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…