పుష్ప ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాని రెండో భాగం పూర్తి చేసే వరకు కొత్త కమిట్ మెంట్లు ఇవ్వడం లేదు. తర్వాత చేయబోయే చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అన్న విషయం ముందే తెలిసిపోయినా దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరోవైపు ఆహా ఓటిటి బన్నీ, శ్రీలీల కాంబోతో మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ హంగామా చేస్తోంది. ఇది సినిమానా మరొకటానే విషయం స్పష్టంగా చెప్పలేదు. యాడ్ క్యాంపైన్ అని ఒకరు లేదు స్పెషల్ సాంగని మరొకరు అంటున్నారు.
ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది కానీ ఇది ముమ్మాటికీ సినిమా అయితే కాదు. ఎందుకంటే ఎంత తండ్రి నడిపే సంస్థ అయినా బన్నీ ఓటిటి మూవీ చేయడు. అది కూడా గుంటూరు కారంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్, శ్రీలీలను తీసుకొచ్చి. ఇదంతా పబ్లిసిటీ స్టెంటని ఫ్యాన్స్ అభిప్రాయం. ఏది ఏమైనా అదేదో క్లారిటి ఇచ్చేస్తే బాగుంటుంది. గతంలోనూ ప్రతి శుక్రవారం ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉంటుందనే యాడ్ ని బన్నీతో చేయించుకున్న ఆహా ఆ మాట మీద నిలబడలేదు. మధ్యలో గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్త ప్రాజెక్టుతో ఏం చెప్పబోతున్నారో వేచి చూడాలి.
కానీ ఇలా అల్లు అర్జున్ ఆహా మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. పుష్ప అయ్యాక ఏం చేస్తాడనే ఉత్సుకత విపరీతంగా ఉన్న టైంలో ఇలా ఆహా మార్కెటింగ్ లో పాలు పంచుకోవడం గురించి ఎవరైనా చెప్పేదేముంటుంది. మార్కెట్ పరంగా ఆహా గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఇటీవలి కాలంలో సోనీ లివ్ దూకుడు పెంచింది. ఇంటర్నేషనల్ కంటెంట్ కే పరిమితమైన నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది చాలా తెలుగు సినిమాలు కొనేసుకుంది. ప్రైమ్ సంగతి సరేసరి. భారీ సంఖ్యలో వ్యూయర్స్ ని ఆకట్టుకోవాలంటే బలమైన ఎత్తుగడ కావాలి. అందుకే బన్నీ రంగంలోకి దిగాడు
This post was last modified on June 14, 2023 10:40 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…