దక్షిణాది టాప్ స్టార్లలో, మేటి నటుల్లో సూర్య ఒకడు. అతడి ప్రతిభ గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో అతను ప్రేక్షకులను కదిలించేశాడు. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు కావడం విశేషం.
బిజినెస్ అంతకు రెట్టింపు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సూర్య నటించబోయే ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది ఒక బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ‘రంగ్ దె బసంతి’, ‘బాగ్ మిల్కా బాగ్’ చిత్రాలతో బాలీవుడ్ మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. ‘రక్త చరిత్ర-2’తో సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు.
ఇప్పుడు ‘కర్ణ’ పేరుతో రాకేశ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయడానికి సూర్య రెడీ అయ్యాడట. పేరును బట్టి ఇది కర్ణుడి కథే అని స్పష్టమవుతోంది. కర్ణుడి మీద సినిమా తీయాలని రాకేశ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఒక రకంగా ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. వందల కోట్ల బడ్జెట్లో రెండు భాగాలుగా ఈ సినిమా తీయడానికి రాకేశ్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.
వేరే నిర్మాణ సంస్థతో కలిసి స్వయంగా అతను ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. ‘కంగువ’ తర్వాత సూర్య.. ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అది తక్కువ టైంలోనే పూర్తయ్యే సినిమా. అది అయ్యాక రాకేశ్‌తో ‘కర్ణ’ చేస్తాడట. ఈ చిత్రం బేసిగ్గా హిందీలో తెరకెక్కినప్పటికీ.. ఆటోమేటిగ్గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలవుతుంది. సూర్య లాంటి నటుడిని సరిగ్గా ఉపయోగించుకుని రాకేశ్ తన బెస్ట్ సినిమాలకు దీటుగా దీన్ని రూపొందిస్తే ఒక మైల్ స్టోన్ మూవీగా మారడం ఖాయం.
This post was last modified on June 13, 2023 4:15 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…