నెలలు వారాలు పోయి రోజుల కౌంట్ డౌన్ లోకి వచ్చేసిన ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే యాభై వేలకు పైగా మల్టీప్లెక్సుల టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ టాక్. ఏ క్షణంలో అయినా ఏపీ తెలంగాణ ఆన్ లైన్స్ మొదలవుతాయి. ప్రభాస్ అభిమానులతో పాటు సాగటు ప్రేక్షకులు వీలైనంత త్వరగా చూడాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. పఠాన్ ని టార్గెట్ చేసుకున్న ప్రభాస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈజీగా రికార్డులని లేపి అవతలేస్తాడు. ఇక సినిమాకు సంబంధించిన కీలక హైలైట్స్ అంతర్గత వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అవేంటో చూద్దాం. మొదటగా వాలి సుగ్రీవుల ఎపిసోడ్ ఊహించని విధంగా షాక్ ఇస్తుందట. దుష్టసంహారం కోసం ధర్మాన్ని పక్కన పెట్టడంలో తప్పు లేదనే రీతిలో చెప్పిన డైలాగులు, అక్కడ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే సన్నివేశం, రాఘవుడు-ఖరుడు మధ్య యుద్ధం, తోకతో హనుమంతుడు లంకా దహనం చేసే సీన్ త్రీడిలో చూస్తేనే ఆ అనుభూతి గొప్పగా ఉంటుందని ఊరిస్తున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే రామ రావణ యుద్ధకాండ ఇండియన్ సినిమాలోనే బెస్ట్ క్లైమాక్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
సైఫ్అలీ ఖాన్ మీద ఉన్న నెగటివిటీ సినిమా చూశాక మొత్తం పోతుందట. సెన్సార్ సభ్యులు విభ్రాంతి చెందేలా దర్శకుడు ఓం రౌత్ మాయాజాలం చేశాడని అంటున్నారు. మొత్తానికి ఇవి వినగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. రామసేతు బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఓ రేంజ్ లో వచ్చిందని తెలిసింది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు లేక డ్రైగా ఉన్న పరిస్థితుల్లో థియేటర్లను హౌస్ ఫుల్ చేసి జనాలతో కిక్కిరిసిపోయేలా చేసేది ఒక్క ఆదిపురుష్ మాత్రమేనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ఎనభై శాతానికి పైగా త్రీడి ప్రింట్లే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు
This post was last modified on June 13, 2023 10:41 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…