దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరు. ఇప్పటిదాకా ఏ భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని రీతిలో ఆయన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. భారత్‌కు సంగీతంలో దక్కిన తొలి ఆస్కార్ అవార్డు అదే. ఇటీవల కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు గాను అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఇక రెహమాన్ సంగీత సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ లెజెండరీ డైరెక్టర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకు ఏఆర్ అమీన్, కూతురు ఏఆర్ ఖటీజా కూడా మ్యూజిక్‌లోకే అడుగు పెట్టారు. వీళ్లిద్దరూ చిన్నతనం నుంచే పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఖటీజా పెద్ద సంఖ్యలోనే పాటలు పాడి తన టాలెంట్ రుజువు చేసుకుంది. ఈ అమ్మాయి యుక్త వయసులోనే సంగీత దర్శకురాలిగా కూడా అరంగేట్రం చేసేస్తుండటం విశేషం.
‘మిన్మిని’ అనే తమిళ సినిమాతో ఖటీజా రెహమాన్ సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తమిళంలో ‘సిల్లు కారుపట్టి’ అనే హిట్ మూవీతో దర్శకురాలిగా మారిన హాలిత షమీమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఖటీజా సంగీత దర్శకురాలిగా మారుతున్న విషయాన్ని హాలితనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఖటీజాతో కలిసి మ్యూజిక్ స్టూడియోలో పాటలు రికార్డు చేస్తున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
అసాధారణ ప్రతిభావంతురాలైన ఖటీజాతో కలిసి పని చేస్తుందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ మేటి సింగర్ ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారుతోందని.. గొప్ప మ్యూజిక్ వినబోతున్నారని ఆమె పేర్కొంది. ‘మిన్మిని’లో మలయాళ దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల కాబోతోంది. మరి తొలి చిత్రంతో ఖటీజా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుందేమో చూడాలి.
This post was last modified on June 12, 2023 11:40 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…